తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ వేడి రాజేసిన  జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు  చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక ఇప్పటికే జిహెచ్ఎంసి ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకునేందుకు అందరూ ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో నేడు అభ్యర్థుల భవితవ్యం ఎంతో తేలనుంది.



 ప్రస్తుతం ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధిస్తాము  అని అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతో ధీమాతో  ఉంది అనే విషయం తెలిసిందే. గ్రేటర్ ఓటర్లు అందరూ కూడా తమ వైపే ఉన్నారని తప్పక విజయం సాధించి తీరుతాము  అంటూ ప్రస్తుతం సవాల్ సైతం చేస్తుంది అధికార టీఆర్ఎస్ పార్టీ. కాగా నేడు గ్రేటర్ ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది ఈ నెల 4వ తేదీన తేలనుంది అనే విషయం తెలిసిందే అయితే.. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కి ముందే అధికార టీఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. అయితే ఈ షాక్ గ్రేటర్ ఎన్నికలకు సంబంధించింది కాకపోయినప్పటికీ ఒకరకంగా ఇది మాత్రం షాక్ అనే చెప్పాలి.



 గ్రేటర్ ఎన్నికలకు ముందే టిఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూశారు. దీంతో ఇది కాస్త ఊహించని షాక్ అనే చెప్పాలి అధికార టీఆర్ఎస్ పార్టీకి. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు అయితే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగార్జునసాగర్ నోముల నర్సింహయ్య ఇటీవలే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. అయితే నోముల నర్సింహయ్య ఎంపీపీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. సీపీఎం పార్టీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరిన నోముల నర్సింహయ్య 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: