దీంతో అయ్యప్ప భక్తులు అందరూ ఎంతో నిరాశ చెందారు. ఇక ఈ ఏడాది అయ్యప్ప దర్శనం దొరుకుతుందో లేదో అని బాధపడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల పుణ్యక్షేత్రం శబరిమల కు భక్తులను అనుమతించే విషయంపై ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. ఇక ఇటీవల కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం సాధారణ రోజుల్లో రోజుకు రెండు వేల మంది భక్తులకు శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇక శని ఆదివారాల్లో మూడు వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తూ అనుమతిచ్చింది కేరళ ప్రభుత్వం.
అయితే రానున్న రోజుల్లో పరిస్థితులను బట్టి శబరిమల ఆలయంలోకి మరింత మంది భక్తులను అనుమతించేందుకు నిర్ణయం తీసుకున్నాము అంటూ కేరళ దేవాదాయ శాఖ మంత్రి తెలిపారు. ఇక కేరళకు సంబంధించిన టికెట్ బుకింగ్ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుందని.. అయితే అనుమతి అంతకంతకూ పెంచుతూ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆరోగ్య శాఖ కూడా తీవ్ర చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది, శబరిమల బేస్ క్యాంపు శిబిరాల వద్ద యాంటిజెన్ పరీక్షలకు ముమ్మరం చేసింది కేరళ ఆరోగ్య శాఖ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి