ప్రస్తుతం చైనా విస్తరణ వాదంతో ముందుకు సాగుతూ ఉండటం చైనాకే సరికొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలకు శత్రుదేశం గా మారిపోతుంది చైనా. అంతేకాకుండా చైనా ఇతర  దేశాల పై ఆధిపత్యం సాధించేందుకు చేసిన ప్రతి పని కూడా రివర్స్ గా మరి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో చైనా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి భారత్  పై ఆధిపత్యం సాధించాలి అనుకుంటే ఏకంగా భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి చైనాకు  సంబంధించిన వ్యూహాత్మక పర్వతాలను కూడా ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఇలా చైనా వేసిన ప్లాన్ కాస్త రివర్స్ అయ్యింది.



 అంతే కాదు ఎప్పుడైనా చైనా ఇతర దేశాలతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కూడా జల యుద్ధం  చేసేందుకు చైనా భారీ ప్రాజెక్టులు నిర్మించి పెట్టింది అన్న విషయం తెలిసిందే. కాగా  ఇలా ఇతర దేశాలకు యుద్ధం కోసం ఉపయోగించేందుకు నిర్మించిన భారీ ప్రాజెక్టులు చైనాకు  కొత్త సమస్యలు తీసుకువచ్చి పెట్టాయి. వర్షాల కారణంగా భారీ వరదలు వచ్చి ప్రాజెక్టులన్నీ పూర్తిగా ధ్వంసం కావడంతో చైనాలో వేసిన అన్ని ఆహార పంటలు దెబ్బతిన్నాయి దీంతో కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడి భారీగా ఆహార సంక్షోభం ఏర్పడింది.



 అయితే భారత్ చైనా సరిహద్దు లో భారత్ కి ఎంత దూకుడుగా వ్యవహరించినప్పటికీ చైనా యుద్ధానికి దిగకుండా  సైలెంట్ గా ఉండడానికి కారణం చైనాలో ఏర్పడిన ఆహార సంక్షోభమే అన్నది ప్రస్తుతం తెలుస్తోంది. ప్రస్తుతం చైనా లో ఉన్నటువంటి ఆహార నిల్వలు కేవలం ఒక నెల రోజులు మాత్రమే సరిపోయేలా ఉన్నాయి అన్నది  నివేదికలు  కూడా చెబుతున్నాయి.  ఇలా చైనాలో ఆహార సంక్షోభం భారీగా ఏర్పడడం కారణంగానే చైనా భారత యుద్ధానికి దిగకుండా సైలెంట్ గా ఉండిపోయింది అని ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా చైనా శత్రు దేశాల పై ఆధిపత్యం సాధించేందుకు నిర్మించిన ప్రాజెక్టులు చైనాలో ఆహార సంక్షోభం ఏర్పడేలా చేస్తాయి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: