ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... జగన్ మోహన్ రెడ్డి హయాంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కాని , మరణాలు స్వల్పంగా పడిపోయాయి. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 61,038 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో  618 మందికి పాజిటివ్‌గా నిర్ధారణలో తేలింది. దీంతో ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో కరోనా వైరస్  సోకిన వారి సంఖ్య 8,73,457కి చేరింది.

అలాగే కరోన వైరస్ వల్ల చనిపోయే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల జరిగిన  మరణాలు కూడా భారీగా పడిపోయాయి. బుధవారం కరోనా బారిన పడి ముగ్గురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఒకరు, నెల్లూరులో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,045కు చేరింది.ఇక జగన్ మోహన్ రెడ్డి హయాంలో డాక్టర్లు చాలా చురుకుగా పని చేస్తున్నారు. ఇప్పటికి చాలా మరణాలు తగ్గడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: