సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో పళ్లు తోముకోవడం అనేది రోజువారీ దినచర్య అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో కొంత మంది రెండుపూటలా పళ్ళు తోముకుంటే కొంతమంది మాత్రం కేవలం ఒక్కసారి మాత్రమే బ్రష్ చేస్తున్నారు. అయితే సాధారణంగా చాలా మంది పళ్ళు తోముకునేటప్పుడు కాస్త నిర్లక్ష్యంగానే బ్రష్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాని కొన్ని కొన్ని సార్లు నిర్లక్ష్యంగా బ్రష్ చేస్తే ఏకంగా ప్రాణాల మీదికి వచ్చే ప్రమాదం కూడా ఉంది అని మాత్రం ఎవరు గ్రహించరు. నిర్లక్ష్యంగా బ్రష్ చేయడం కారణంగా ప్రాణాల మీదికి రావడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. ఇక్కడ జరిగిన ఘటన చూస్తే ఇది నిజం అనిపించకమానదు. సాధారణంగా అందరూ పొద్దున్నే లేచి పళ్ళు తోముకున్నట్లుగానే  ఇక్కడ ఒక వ్యక్తి కూడా బ్రష్ చేసుకున్నాడు. కానీ అంతలో ఊహించని ఘటన జరగడంతో ఆ వ్యక్తి సైతం షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొరపాటున అకస్మాత్తుగా పళ్ళు తోముకునే బ్రష్ కాస్త గొంతులో ఇరుక్కుపోయి కడుపులోకి వెళ్లి పోయింది. టూత్ బ్రష్ ను మింగేయటంతో  సదరు వ్యక్తి ఎంతగానో కంగారు పడిపోయాడు. ఏం జరుగుతుందో అని భయాందోళన లో మునిగిపోయాడు. ఇంతలో అతనికి కడుపు నొప్పి మొదలైంది. దీంతో మరింత ఆందోళనకు గురయిన సదరు వ్యక్తి డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టాడు.  ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది. ఔరంగాబాద్కు చెందిన 33 ఏళ్ల వ్యక్తి పళ్లు తోముకుంటూ  పొరపాటున టూత్ బ్రష్ మింగేశాడు. ఇక ఆ తర్వాత ఈ విషయాన్ని లైట్ తీసుకున్న సదరు వ్యక్తి కాసేపటికే అతనికి తీవ్రమైన కడుపునొప్పి మొదలవడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. దీంతో సమీపంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యం నిమిత్తం చేరాడు. ఈ క్రమంలోనే తాను టూత్ బ్రష్ మింగేసాను అంటూ వైద్యులకు  చెప్పడంతో వైద్యులు సైతం షాక్ అయ్యారు. ఇక వెంటనే స్కానింగ్ నిర్వహించగా కడుపులో టూత్ బ్రెష్  ఉంది అని గుర్తించారు వైద్యులు. తర్వాత ఎంతో కష్టం మీద శస్త్ర చికిత్స నిర్వహించి కడుపులో ఉన్న టూత్ బ్రష్ ని బయటికి తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: