ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడదా  రోజు రోజుకూ ఎక్కువ అయి పోతుంది అన్న విషయం తెలిసిందే. దొంగతనం చేయడమే కాదు చేసిన దొంగతనానికి కప్పిపుచ్చు కోవడానికి ఎంతో తెలివిగా ఆలోచిస్తున్నారు.  చివరికి పోలీసులు తమ దైన శైలిలో విచారించడం తో అసలు నిజాలు బయటకు వస్తున్న షాకింగ్ ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు బాధ్యతగా వ్యవహరించాల్సిన వారే  దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది.



 దొంగలను పట్టుకోవాల్సిన కానిస్టేబుల్ దొంగ గా మారి పోయాడు..  నమ్మిన వారి ఇంటికే కన్నం వేసాడు. తన పైఅధికారి కుటుంబ సభ్యుల ఇంట్లో నగదు అపహరించి ఇక పోలీసులు సైతం తప్పు దోవ పట్టించాడు.  కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడం తో అసలు నిజాలు బయట పెట్టాడు ఈ ఘటన గుంటూరు లో చోటుచేసుకుంది. నాగార్జున యూనివర్సిటీ లోని పదవ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్కు సంతోష్ కుమార్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్డిఆర్ఎఫ్ లోని కమాండెంట్ కార్యాలయం వద్ద డిప్యుటేషన్ పై వెళ్ళాడు కానిస్టేబుల్ శ్రీనివాస్ రావు.



 ఇక ఏళ్లుగా శ్రీనివాస రావు అక్కడే విధులు నిర్వహిస్తూ ఉండడంతో అటు కమాండెంట్ కుటుంబ సభ్యులు కూడా అతనిపై నమ్మకం ఉంచారు.  కమాండెంట్ సంతోష్ తన ఇంటి దళాలను కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు ఇచ్చారు. ఈ క్రమంలోనే నమ్మిన బంటుగా ఉన్నాడు అనుకున్న కానిస్టేబుల్ నమ్మకద్రోహం చేశాడు. కమాండెంట్ ఇంట్లో దొంగతనానికి  పాల్పడ్డాడు. విలువైన బంగారు ఆభరణాలను దొంగలించాడు.  అంతేకాదు ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ఎన్నో అబద్ధాలు కూడా చెప్పాడు.  ఎట్టకేలకు పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడం తో అసలు నిజం ఒప్పుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: