ఈ మధ్యకాలంలో దొంగల బెడద రోజురోజుకు ఎక్కువైపోతుంది అన్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా కూడా దొంగలు రెచ్చిపోయి అందినకాడికి దోచుకుంటున్నారు.  తాళాలు ఉన్న ఇళ్లను  టార్గెట్ చేసి ఇక తాళాలు పగులగొట్టి ఇంట్లో అందినకాడికి దోచుకోవడమే  కాదు  విలువైన వాహనాలను కూడా దొంగతనం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే చిన్న చిన్న వస్తువులను కూడా వదలడం లేదు అని  చెప్పడంలో అతిశయోక్తి లేదు. దొంగల బెడద నుంచి ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా దొంగలు రెచ్చిపోతూ దోపిడీకి పాల్పడుతున్నారు ఇక్కడ దొంగలు ఇలాంటి తరహా దోపిడీ చేశారు.



 సాధారణంగా దొంగలు ఎంతో విలువైన వస్తువులను దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఇక్కడ ఏకంగా సైకిల్ దొంగిలించడానికి  కూడా వెనకడుగు వేయలేదు దొంగలు. అదికూడా ఒక వికలాంగుడు దగ్గర సైకిల్ దొంగతనం చేశారు. రెండు రోజుల పాటు కష్టపడి పైసా పైసా కూడా పెట్టుకొని వికలాంగుడు కొనుక్కున్న సైకిల్ పై కూడా దొంగల కన్ను పడి చివరికి ఆ సైకిల్ ను కూడా ఎత్తుకెళ్లారు. అయితే అప్పటికే ఎంతో కష్టపడి సైకిలు కొనుక్కున్ వికలాంగులు సైకిల్ పోవడంతో లబోదిబో మన్నాడు.  అయితే సాధారణంగా దొంగతనాలు జరిగినట్లు పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకుంటూ ఉంటారు.



 ఏదైనా పెద్ద దొంగతనం జరిగినప్పుడు స్థానిక రాజకీయ నాయకులు ఎంట్రీ ఇచ్చి ఇక తొందరగా విచారణ పూర్తి కావాలి అని అటు పోలీసులకు కోరుతూ ఉంటారు. ఇక్కడ మాత్రం సైకిల్ దొంగతనం జరిగితే ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ఓ వికలాంగ వ్యక్తి తన కొడుకుకు  కొనిచ్చిన సైకిల్ పోయిందని.. దాని ధర ఆరు వేల వరకు ఉంటుందని ఆ సైకిల్ కొనడానికి ఆరునెలలపాటు కష్టపడాల్సి వచ్చిందని ఎవరికైనా వివరాలు తెలిస్తే చెప్పాలి అంటు  ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టాడు. ఈ ఘటన కేరళలో జరిగగా.. వెంటనే స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి స్పందించి కలెక్టర్ తో  మాట్లాడి అతనికి సైకిల్ ఇప్పించడమే కాదు  స్వయం ఉపాధి పొందేందుకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: