ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కాంగ్రెస్ పార్టీ సుధీర్ఘ పాలన తరువాత బీజేపీ పార్టీ గెలిచి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యి దేశాన్ని పాలించడం జరుగుతుంది. ఇక నరేంద్ర మోడీ గురించి చెప్పాలంటే ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పిన తక్కువే. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ప్రధాన మంత్రి అని చెప్పాలి. దేశానికి ఎన్ని సమస్యలు వచ్చిన వెనకడుగు వెయ్యకుండా పాలించి ముందుకు నడిపించే నాయకుడు నరేంద్ర మోడీ. అందుకే మోస్ట్ పవర్ ఫుల్ ప్రైమ్ మినిస్టర్ గా యావత్ ప్రపంచాన్నే ఆకర్షంచి తన వైపు తిప్పుకునేలా చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. స్టేజ్ పై ఆయన ప్రసంగాలు వింటుంటే వినేవాళ్లకి ఎంతో ధైర్యం వస్తుంది. భారత దేశాన్ని ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా కృషి చేస్తున్నారు నరేంద్ర మోడీ.. కాని ఒక్క విషయంలో అయితే మాత్రం నరేంద్ర మోడీ మధ్య తరగతి ప్రజలకు అన్యాయం చేస్తున్నారనే చెప్పాలి.. ఇక అసలు విషయానికి వస్తే...

మన భారతదేశం చాలా పెద్ద దేశం. అనేక వర్గాలు వారు నివసిస్తున్నారు. ఎక్కువగా పేద మధ్యతరగతి వర్గం వారు నివసిస్తున్నారు. ఒక ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదు అంటారు. ఆమె కన్నీళ్లు పెడితే ఆ ఇంటికి మంచి జరగదు. చెడు జరుగుతుంది. ఇది పాతకాలం నుంచి వస్తున్న సామెత. ఇక మన దేశంలో మధ్యతరగతి కుటుంబాలు ఏడిస్తే అది దేశానికి ఎంత మాత్రం మంచిది కాదు.ఒక పూట తిని రెండు పూటలు తినకుండా పస్తులు ఉండి తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే మధ్య తరగతి కుటుంబాలు దేశంలో చాలానే వున్నాయి. ఇక మధ్య తరగతి కుటుంబాలకి పెట్రోల్ కూడా నిత్యావసరం అనే చెప్పాలి.

అలాంటి పెట్రోల్ ధరని నరేంద్ర మోడీ పెంచేస్తే మధ్య తరగతి ప్రేక్షకులు ఎంతో ఇబ్బంది పడతారు. పెట్రోల్ ధర ఇప్పుడు మినిమం  101 రూపాయలు వుంది.ఇది మధ్యతరగతి కుటుంబాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇలా ఆకాశాన్నంటే ధరలు మోడీ గారు ప్రవేశ పెడితే మధ్య తరగతి ప్రజలు ఎలా బ్రతుకుతారు? కాబట్టి కేంద్రం దీనిపై దృష్టి పెట్టాలి. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రాజకీయ వార్తల గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: