ఇక్కడ వాట్సాప్ స్టేటస్ ఏకంగా ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. ఒక విద్యార్థి తన వాట్సాప్ స్టేటస్ లో మిత్రుడి ప్రేయసి ఫోటోను పెట్టి ఐ లవ్ యూ అంటూ క్యాప్షన్ ఇవ్వడం వివాదానికి దారి తీసి చివరికి విద్యార్థి ప్రాణం పోయే పరిణామాలకు దారి తీసింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గురవయ్య శివ కుమారి దంపతులకు ఏకైక కుమారుడు వెంపటి సాయి విజయవాడలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ కొంతమంది విద్యార్థులు అతనికి పరిచయమయ్యారు.
ఇక సాయి కి పరిచయమైన వారిలో ఒక ఐటిఐ విద్యార్థి తన ఇంటి సమీపంలో ఉన్న యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఇటీవలే ఐటిఐ విద్యార్థి ప్రేమిస్తున్న యువతి ఫోటోను తన స్టేటస్ లో పెట్టి ఐ లవ్ యూ అని రాశాడు సాయి. స్టేటస్ చూసిన ఐ టి ఐ విద్యార్థి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే సాయిని ఉండవల్లి సెంటర్ కు పిలిపించి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అక్కడికి వచ్చి సాయి పై దాడికి పాల్పడ్డాడు. ఇక ఆ తర్వాత సాయి కనిపించకుండా పోవడంతో ఇక తల్లిదండ్రులు కంగారు పడిపోయి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఇక విచారణలో భాగంగా సాయి పై దాడిచేసిన నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అంతలోనే ఒక కెనాల్ దగ్గర శవమై కనిపించాడు సాయి. కేసులు ఇంకా విచారణ కొనసాగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి