తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ ఒక చారిత్రాత్మక విజయాన్ని ఇప్పుడు నమోదు చేసుకున్నట్టు కనిపిస్తోంది. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి పెద్ద పార్టీలను సైతం వెనక్కి నెట్టి మరి మొదటి ప్రయత్నంలోనే ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం అందరి రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. త్రిష బర్త్డే రోజున ఎన్నికల ఫలితాలు వెలుపడడం విజయ్ గెలుపు వార్త వినడంతో త్రిషకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా ఇటీవలే విజయ్ ఇంటికి వెళ్లి మరి అభినందనలు తెలిపినట్లుగా కొన్ని వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
త్రిష 43వ పుట్టినరోజు విజయోత్సవం ఇలా జరుపుకోవడం మరింత విశేషంగా మారినట్టు కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలకు ముందు త్రిష తిరుపతి బాలాజీ ఆలయాన్ని కూడా సందర్శించారు. అయితే ఈ దర్శనం కూడా అటు విజయ్ కోసమే అంటూ చాలానే వార్తలు వినిపించాయి. త్రిష ప్రార్థనలు ఫలించాయని అభిమానులు భావించడమే కాకుండా చాలా మంది సెలబ్రెటీలు త్రిష కోరిక తీరింది అంటూ పలు రకాలుగా ట్విట్లు చేస్తూ వైరల్ గా చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలామంది ప్రియురాలు పుట్టినరోజు కానుకగా రాజకీయ విజయాన్ని అందించారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్, త్రిష ఆన్ స్క్రీన్ జోడి మాత్రం మంచి పేరు ఉంది. చాలాకాలం తర్వాత జియో సినిమాలో కూడా కలిసి నటించారు. అయితే ప్రస్తుతం మాత్రం వీరి వ్యక్తిగత సంబంధం పైన మాత్రం ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ తన భార్య సంగీతతో విడాకుల వ్యవహారం పై వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో త్రిషతో ఉన్న అనుబంధం ప్రాధాన్యత గురించి కూడా పలు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వీటన్నిటిని చూస్తూ ఉంటే త్రిష రాజకీయాలలోకి రావాలని ఆలోచిస్తోందా ?అంటే సరైన సమాధానం లేదు. కానీ విజయ్ రాజకీయ ప్రయాణంలో మాత్రం త్రిష కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు ఉన్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంలో ఒకవేళ త్రిష కీలకపాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయనే విధంగా వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి