వివరాల్లోకి వెళితే.. చిత్తోర్ ఘర్ జిల్లా లోని ఓ గ్రామంలో ఉంటున్న దళిత మహిళకు.. ఆమె ఇంటి పక్కనే ఉన్న మరో మహిళతో గత కొన్ని రోజుల క్రితం వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మహిళపై దాడి చేయాలని నిర్ణయించుకుంది మరో మహిళ. తన కొడుకు ఈ విషయం తెలిపి దాడి చేయాలని రమ్మని చెప్పింది. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం.. దళిత మహిళ బట్టలు ఉతుకుతున్న సమయంలో.. బైక్ పై వచ్చిన తల్లి కొడుకులు మహిళ లెహంగా తీసేసి ఆమె తొడలపై.. మర్మాంగాలపై దారుణంగా కొట్టారు.
అంతేకాదు నడిరోడ్డుపైనే ఆమె బట్టలు మొత్తం చింపేశారు. సైకిల్ చైన్ తో కొడుకు దారుణంగా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. మహిళపై దాడులు జరుగుతుంటే అక్కడున్న గ్రామస్తులు అంతా కూడా చోద్యం చూస్తున్నట్లుగా ఉండిపోయారు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇక పొలానికి వెళ్లిన భర్త వెంటనే అక్కడికి వచ్చేసరికి భార్య అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక వెంటనే భార్యను ఆసుపత్రికి తరలించాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేసాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి