ఈ మధ్యకాలంలో యువతలో ప్రతి ఒక్కరిలో అధిక బరువు అనే సమస్య తలెత్తుతుంది అన్న విషయం తెలిసిందే. అధునాతన జీవనశైలికి అలవాటు పడిపోయి అధిక బరువు పెరగడం ఇక బరువు తగ్గించుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో ఇక బరువు తగ్గిస్తాం అంటూ ఇప్పటికే ఎన్నో రకాల కంపెనీలు తమ ప్రొడక్టులను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. అయితే రోజువారి అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు ఎంతో సులభంగా బరువు తగ్గొచ్చు అని అటు నిపుణులు కూడా సూచిస్తున్నారు.
ముఖ్యంగా సరైన జీర్ణక్రియ మంచి నిద్ర బరువును తగ్గిస్తాయి అంటూ చెబుతున్నారు నిపుణులు. రాత్రి భోజనంలో అధిక కాలరీలు అందించే ఆహారం కి, స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉంటే మంచిది అని చెబుతున్నారు. అంతేకాదు రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించే ముందు.. బాదం లేదా సోయా పాలు తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందట. ఒక కప్పు చమోమిలే టీ తీసుకోవడం ద్వారా కూడా ప్రయోజనం ఉంటుందట. దాల్చిన చెక్క టీలో తేనె కలుపుకొని తాగితే కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందట. అంతే కాకుండా నానబెట్టిన మెంతులు నిద్రకు ఉపక్రమించే ముందు తింటే బరువు తగ్గడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా పసుపు పాలు కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి