ఈ మధ్య కాలంలో అందరూ కూడా అందంపై ఎంతగానో దృష్టిపెట్టారు. సాధారణంగా ఉన్న అందాన్ని కాకుండా ఇక పైపైన అందాలు చూపించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ముఖానికి ఎన్నో రకాల క్రీములు రాసుకోవడం లాంటివి చేస్తున్నారు. సహజ అందం తో సంతృప్తి చెందక ఏకంగా ఆర్టిఫిషియల్ అందం వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు నేటి రోజుల్లో జనాలు. ఈ క్రమంలోనే ఇక మెడికల్ షాప్ ల చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాల క్రీమ్స్  వాడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఎన్ని రకాల క్రీమ్స్ వాడినప్పటికీ కూడా కేవలం అవి కొన్ని రోజుల వరకు మాత్రమే తాత్కాలిక ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిందే.


 అయితే తాత్కాలికంగా మెడికల్ షాప్ లో దొరికే క్రీమ్స్ వాడి అందాన్ని పెంచుకోవడం కంటే ఇక పలురకాల ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటే  సహజసిద్ద  అందాన్ని పెంచుకోవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం పలు రకాల పండ్లు తినడం పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది అని నిపుణులు సూచిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  కేవలం చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి పైన మెరుగులు దిద్దితే సరిపోదని ఆరోగ్యాన్ని పెంచితే చర్మసౌందర్యం ఆటోమేటిక్ గా మీ సొంతం అవుతుంది అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.



 అయితే ఇలా చర్మసౌందర్యాన్ని పెంచేందుకు ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు నిపుణులు. సూర్యరశ్మి ద్వారా వచ్చే యు.వి కిరణాల నుంచి చర్మం దెబ్బతినకుండా రక్షించి ఎప్పుడూ కాంతివంతంగా ఉంచేందుకు ద్రాక్షలోని పాలి ఫినాల్స్ అనే సహజసిద్ధ గుణం ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ద్రాక్ష రసాన్ని లోషన్ లాగా కూడా చర్మానికి రాసుకునేందుకు అవకాశం ఉంది అంటూ చెబుతున్నారు. ఇలా రెగ్యులర్ గా ద్రాక్ష తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం అంతకంతకూ పెరిగి పోతుంది అని..  ఆరోగ్యంగా కూడా ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: