మొదట క్షణకాల సుఖం కోసం ప్రారంభమయ్యే ఈ అక్రమ సంబంధాలు చివరికి ఎక్కడ వరకు దారి తీస్తాయి అన్నది కూడా తెలియని స్థాయికి దిగజారి పోతున్నాయి. ఇక్కడ ఇలాంటి ఓ వివాహేతర సంబంధమే తెరమీదికి వచ్చింది. స్కూల్లో సైన్స్ టీచర్ గా పని చేస్తున్న మహిళ లెక్కల మాస్టారు తో అక్రమ సంబంధానికి తెరలేపింది. అయితే ఓ రోజు ఈ విషయం లెక్కల మాస్టారు భార్యకు తెలియడంతో ఇద్దరినీ నిలదీయగా చివరికి ఇద్దరూ కలిసి.. లెక్కల మాస్టారు భార్య ప్రాణం తీశారు ఈ ఘటన బీహార్లోని బెగుసరాయ్ లో చోటుచేసుకుంది.
రామ్ లాల్ అనే వ్యక్తి తన భార్య సుమతి తో కలిసి నివసిస్తున్నాడు. గత మూడేళ్లుగా ఒక స్కూల్లో లెక్కల మాస్టర్ గా పని చేస్తుండగా ఇక అక్కడ అదే స్కూల్ లో పనిచేస్తున్న సైన్స్ టీచర్ దామినితో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. కరోనా వైరస్ కారణంగా స్కూల్ మూతపడడంతో వీరిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. అయితే ఈ మధ్య కాలంలోస్కూల్ అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్లి రాసలీలల్లో మునిగి తేలారు. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి లెక్కల మాస్టారు భార్య సుమతికి తెలిసింది. అయితే ఓరోజు ప్రియురాలితో భర్త ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య నిలదీయడంతో ఇక గొడవ పెద్దది అవుతుందని భావించిన భర్త భార్య గొంతు నులిమి చంపేశాడు తర్వాత మృతదేహాన్ని చీర కట్టి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించాడు. మృతదేహంపై దెబ్బలు కనిపించడంతో రంగంలోకి దిగిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి