దేశవ్యాప్తంగా జ‌రుగుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న రాష్ట్రం త‌మిళ‌నాడు. ఇక్క‌డ ప్ర‌స్తుతం అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉంది. ప‌దేళ్ల పాటు ఆ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఇప్పుడు స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే పార్టీ ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఇక జాతీయ మీడియాతో పాటు వెలువ‌డుతోన్న ప్రీ పోల్ స‌ర్వేలు సైతం ఈ ఎన్నిక‌ల్లో డీఎంకే విజ‌య‌ఢంకా మోగిస్తుంద‌ని వెల్ల‌డిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ సీఎం కావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.  

ఇక స్టాలిన్ పార్టీకి కంచుకోట‌గా ఉన్న కొళ‌త్తూరు నియోజ‌క వ‌ర్గం నుంచి స్టాలిన్ బ‌రిలో నిలుస్తున్నారు. ఆయ‌న త‌న‌యుడు ఉద‌య నిధి స్టాలిన్ సైతం న‌గ‌రంలో పార్టీకి పట్టు ఉన్న చెపాక్ - ట్రిప్లికేన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నారు. అయితే ఈ ఎన్నిక‌ల్లో కొళ‌త్తూరులో స్టాలిన్ ను ఓడించి తీరుతాన‌ని ఓ ఓ రెడ్డి శ‌ప‌థం చేస్తున్నారు. ఆమె ఎవ‌రో కాదు హిజ్రా అప్స‌రారెడ్డి. ఆమె  అన్నాడీఎంకే ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.

స్టాలిన్‌పై కొళ‌త్తూరు నియోజ‌క‌వ‌ర్గంలో అన్నాడీఎంకే నుంచి పోటీ చేసేందుకు ద‌ర‌ఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్ పై పోటీ చేయ‌డ‌మే కాకుండా.. ఆయ‌న్ను ఓడిస్తాన‌ని కూడా శ‌ప‌థం చేశారు. స్టాలిన్ కావాల‌ని అన్నాడీఎంకే ప్ర‌భుత్వం తో పాటు... ముఖ్య‌మంత్రి ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామి పైనా లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. హిజ్రాల కోసం అన్నాడీఎంకే ప్ర‌భుత్వం ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తోంద‌ని అప్స‌రా రెడ్డి చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: