సమయానికి తిండి తినడం ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్ర పోవడం కూడా అంతే ముఖ్యం. ఈ కాలంలో చాలా మందికి నిద్ర పోయే తీరిక కూడా ఉండడం లేదు. మనం గాఢ నిద్ర పోతేనే మన శరీరంతో పాటు, మన  అవయవాలు, మన మెదడు కూడా విశ్రాంతి తీసుకుంటుంది. ఫలితంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు.అయితే ఇందులో నిజం ఎంత  ఉందని తాజా పరిశోధన కూడా నిరూపించింది. ఈ విషయం తెలిస్తే మీరే షాక్ అవుతారు తెలుసా.. !!అదేంటంటే ఎక్కువ సమయం నిద్రపోయేవారికి కరోనా సోకే అవకాశం తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో కనుగొన్నారు.


నిద్రకు, కరోనా తీవ్రతకు ఉన్న సంబంధంపై వివిధ దేశాలకు చెందిన  ఎనిమిది మంది శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, UK, USAల్లోని హెల్త్ వర్కర్ల నిద్ర అలవాట్లను శాస్త్ర వేత్తలు తెలుసుకున్నారు.పోయిన సంవత్సరం జూలై 17 నుంచి సెప్టెంబర్ 25 వరకు వాళ్లపై ఒక సర్వే చేశారు.ఆ సర్వే లో తెలిసినది ఏంటంటే  నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర అనారోగ్యాలు ఉన్నవారు ఇతరులతో పోలిస్తే కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉండడంతో పాటు వీళ్ళు  కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని గుర్తించారు.



ఇందుకు కోవిడ్-19 రోగులకు సేవలందించిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలపై ఆన్‌లైన్‌ సర్వే చేశారు. మొత్తం 2,884 మంది హెల్త్ కేర్ వర్కర్లపై ఈ సర్వే చేశారు. వీరిలో 568 మంది కోవిడ్-19 (Covid-19) బారిన పడినవారు ఉన్నారు.వీరిలో వైరస్ తీవ్రతను, లక్షణాలను బట్టి ఐదు విభాగాలుగా విభజించి సర్వే చేసారు.  వీరందరూ రాత్రి సగటున ఆరు నుంచి ఏడు గంటలు నిద్ర పోతున్నట్లు గుర్తించారు.అంటే రాత్రి ఒక్క గంట ఎక్కువగా నిద్రపోయేవారిలో వైరస్ ప్రభావం 12 శాతం తక్కువగా ఉన్నట్లు ఈ సర్వే లో తేలింది. ఈ రిసెర్చ్ ఫలితాలను BMJ న్యూట్రిషన్ ప్రివెన్షన్ అండ్ హెల్త్ అనే ఆన్‌లైన్ జర్నల్‌లో ప్రచురించారు.గాఢనిద్ర లేకపోవడం, తరచూ మెలకువ రావడం, ఇతర నిద్ర సంబంధ సమస్యలు ఉన్న వారికి వైరస్, బ్యాక్టీరియాలు వ్యాపించే అవకాశం ఎక్కువని గత పరిశోధనల్లో తేలింది. కానీ ఈ లక్షణాలు కోవిడ్-19కు కూడా ప్రమాద కారకాలుగా మారుతాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: