నిన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో పలు ప్రాంతాలలో అధికారి వైసీపీ పార్టీ దొంగ ఓట్లకు పాల్పడింది అంటూ అటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అధికార పార్టీ పై విరుచుకుపడ్డాయి. కేవలం మాటల యుద్ధమే కాదు దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాయి. దీంతో అధికార పార్టీ తీరు కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. గెలుస్తాము అనే ధీమాతో ఉన్న అధికార పార్టీ ఇలా దొంగఓట్లకు పాల్పడటం మాత్రం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇప్పటికి కూడా ఇదే విషయంపై అన్ని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయింది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అందరూ కుట్రపూరితంగా తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్లో ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మందిని తీసుకు వచ్చి దొంగ ఓట్లు వేయించారు అంటూ ఆరోపించారు చంద్రబాబు నాయుడు. తిరుపతి అసెంబ్లీ పరిధిలో జరిగిన పోలింగ్ ను రద్దు చేస్తూ మరోసారి కేంద్ర బలగాల మధ్య ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి అంటూ డిమాండ్ చేశారు చంద్రబాబు. తిరుపతి ఉప ఎన్నిక నిర్వహించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలం అయింది అంటూ వ్యాఖ్యానించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి