కరోనా కనికరించడం లేదు. ఏ మాత్రం తగ్గకుండా విజృంభిస్తూనే ఉంది. ఫస్ట్ వేవ్ అంటూ వచ్చిన కరోనా దేశంలో చాలామందిని పొట్టనబెట్టుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ అంటూ, అందరినీ వణికిస్తుంది. మొదటి వేవ్ కంటే భయంకరంగా విస్తరిస్తూ, మనషుల ప్రాణాలని గాల్లో కలిపేస్తుంది. ఇక ఈ కరోనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీవ్రంగా ఉంది.
ఊహించని విధంగా ఏపీలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రోజుకూ 12 వేల పైనే కరోనా కేసులు వస్తున్నాయి. అలాగే వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా కరోనా ఊపిరితిత్తులు మీద దాడి చేసి, మనిషి ఊపిరి తీసేస్తుంది. రాష్ట్రంలోని హాస్పిటల్స్లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా కనిపిస్తోంది. పైకి ప్రభుత్వం ఆక్సిజన్ కొరత లేదని చెబుతున్నా, వాస్తవానికి చూసుకుంటే ఆ పరిస్తితి లేదు.
కరోనా దెబ్బకు ఊపిరి అందని కేసులు ఎక్కువైపోయాయి. ఇక అలాంటి వారికి తగ్గట్టుగా ఆక్సిజన్ సరఫరా లేకుండా పోయింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎంత చేయాలో అంతా చేస్తుంది. ఇదే సమయంలో ఇది ప్రభుత్వ వైఫల్యమే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వం, ప్రతిపక్షం అని లేకుండా చూస్తే, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు అండగా ఉంటున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు.
కరోనా తీవ్రంగా విజృభిస్తుండటంతో నాయకులంతా సైడ్ అయిపోయినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకు ఓట్ల కోసం జనాల్లో కనిపించిన నాయకులు, ఇప్పుడు అడ్రెస్ లేరు. ఎన్నికల సమయంలో ప్రజల ఓట్ల కోసం మాస్కులు లేకుండా మరీ తిరిగిన నాయకులు, ఇప్పుడు మోహమే చూపించడం లేదు. ఏదో కొందరు తప్పా, మెజారిటీ నాయకులు ప్రజలకు ధైర్యం చెప్పే కార్యక్రమం చేయడం లేదు.
కొందరు నేతలైతే పూర్తిగా ఇళ్లకే పరిమితమైపోయారు. సరే కరోనా తీవ్రంగా ఉంది కాబట్టి, ఇళ్లకే పరిమితమైన, ఏదొక రూపంలో ప్రజలకు సాయం చేయాల్సిన బాధ్యత నాయకుడుపైనే ఉంటుంది. కానీ అలాంటి పరిస్తితి ఏపీలో కనిపించడం లేదు. మొత్తానికైతే కరోనా కనికరించడం లేదు అనుకుంటే, అండగా ఉండాల్సిన నాయకుడు కూడా కనిపించడం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి