కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా దేశాలు దీన్ని కట్టడి చెయ్యలేక తలలు పట్టుకుంటున్నాయి.ముఖ్యంగా భారత్ అల్లాడిపోతుంది.ఇక దీన్ని కట్టడి చేయడంలో ప్రపంచ దేశాలకు తైవానే ఆదర్శమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వైరస్ వెలుగుచూసిన డ్రాగన్ కంట్రీకి చాలా దగ్గరగా ఉండే దేశం. చైనాకు కేవలం 130 కి.మీ దూరంలోనే ఉంటాది. ఈ దేశం జనాభా 2.3కోట్లు. ఇప్పటి వరకు తైవాన్‌లో కేవలం 1,153 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇందులో 12 మంది మృతి చెందారు. తొలుత వైరస్ వెలుగుచూసిన సమయంలోనే చైనాలోని వ్యూహాన్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులను తైవాన్ క్వారంటైన్ చేసింది.


తరువాత తైవాన్ లో కేసులు బయటపడిన తర్వాత టెక్నాలజీ సాయంతో కరోనా రోగులను ట్రేసింగ్ పద్దతిలో గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకుంది. దీంతో గతేడాది ఏడాది అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా డైలీ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదైన వేళ.. 200 రోజులపాటు అక్కడ స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ, దుర దృష్టవశాత్తు నవంబర్‌ 30న ఒకే రోజు 24 కేసులు వెలుగుచూశాయి. వీటిలో అత్యధికంగా ఇండోనేషియా నుంచి వచ్చిన వారు ఉండడం తైవాన్ అధికారులు గుర్తించింది. దాంతో దేశంలోని ఇండోనేషియా వాసులందరికీ టెస్టులు నిర్వహించింది. అనుమానుతుల్ని క్వారంటైన్ సెంటర్లకు తరలించింది. తైవాన్ కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్ బృందం ఎప్పటికప్పుడు ట్రేసింగ్, టెస్టింగ్‌తో మళ్లీ దేశంలో వైరస్ వ్యాప్తి లేకుండా చూసింది. ఇలా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కఠినంగా వ్యవహరించిన తైవాన్‌, ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.


ఇక చైనాలోని వ్యూహాన్‌లో మహమ్మారి విజృంభణను గుర్తించిన తైవాన్... ఈ విషయాన్ని డిసెంబరు 31న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌ఓ)కు తెలియజేసింది. కానీ, తైవాన్‌ మాటలను డబ్ల్యూహెచ్‌ఓ పట్టించుకోలేదు. తేలికగా తీసుకుంది. అయినప్పటికీ తైవాన్‌ మాత్రం ముందుజాగ్రత చర్యగా వైరస్‌ కట్టడికి ముమ్మరంగా ప్రయత్నించింది. సెంట్రల్‌ ఎపిడమిక్‌ కమాండ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అనుమానితులను ట్రేస్‌ చేయడం మొదలు పెట్టింది. ఇప్పటికీ ఈ ప్రక్రియ తైవాన్‌లో కొనసాగుతోంది. పాజిటివ్‌ వచ్చిన వారిని ప్రత్యేక క్యాబ్‌లు ఏర్పాటు చేసి హోటళ్లలో ఉంచుతూ వైరస్‌ వ్యాప్తిని అరికడుతోంది. ఇలా తైవాన్ కరోనా కట్టడిలో ప్రపంచదేశాలకు ఆదర్శంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: