మన దేశంలో కుల, మత, వర్ణాల పట్ల వివక్ష ఇప్పటికీ ఉంది. ఈ దేశంలో పుట్టినందుకు ఇది మన దౌర్భాగ్యమనుకోవాలి. దీనికి సంబంధించిన ఒక చిన్న సంఘటన గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. భారతదేశంలో ముఖ్యంగా వైద్య వ్యవస్థలో చాలా లోటు పాట్లు ఉన్నాయి. ఈ లోటు పాట్లు వలన ఎన్నో దుర్మార్గాలు మరియు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యాధికి మన ఇండియా ప్రజలకు వ్యాక్సిన్ వాడాలంటే, ప్రపంచమంతా వాడిన 30 లేదా 40 సంవత్సరాల తర్వాత మనము వాడుతూ ఉంటాము. ఇది అప్పట్లో మన దేశానికి ఉన్న దరిద్రమని చెప్పొచ్చు. ప్రపంచంలో అందరికన్నా ముందుగా హెపటైటిస్ బి కి వ్యాక్సిన్  కనుగొంది మన ఇండియా. శాంతా బయోటిక్ అనే కంపెనీ ఇది కనుగొంది. ఆ రోజుతో మన దేశం కూడా ప్రపంచంలో వ్యాక్సిన్ తయారు చేసే పలు దేశాల లిస్టులో చేర్చింది శాంత  బయోటెక్ ఎండి వరప్రసాద్. ఈ విషయంపై మన దేశాన్ని ప్రపంచమంతా కీర్తించింది.  అంతే కాకుండా అప్పటి ప్రధాన మంత్రిగా ఉన్న ఐ కె గుజ్రాల్ కూడా ఈ విషయంపై ఆనందపడి ఈ వ్యాక్సిన్ ఆవిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ కి రావడానికి ఒప్పుకున్నారు..

ఇది ఎంత గొప్ప విషయం. కానీ అప్పుడు ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ విషయం పట్ల వ్యవహరించిన తీరును ఒక ఇంటర్వ్యూలో శాంత  బయోటెక్ ఎండి వరప్రసాద్ బయటపెట్టారు.  వరప్రసాద్ మాట్లాడుతూ మన దేశంలోనే ఫస్ట్ జెనెటిక్  వ్యాక్సిన్ గా ప్రపంచం గుర్తించింది. దీనిని స్వయంగా ప్రధాని ఐ కె గుజ్రాల్ ఆవిష్కరించాలని పార్లమెంట్ లో నిర్ణయించారు. ప్రధాని నాకు ఫోన్ చేసి పిలిపించారు. నేను వెళ్లి గుజ్రాల్ ను కలిశాను. ఆయన కూడా వస్తానన్నారు. ఆగష్టు 15 న ఎర్రకోటలో ప్రోగ్రాం ఉంది, కాబట్టి ఆగష్టు 18 న నేను హైద్రాబాద్ వస్తాను, ముందు మీరు మీ సీఎం చంద్రబాబు నాయుడు ను కలిసి ఈ విషయం మాట్లాడండి అని చెప్పారు.  అయితే చాలా సార్లు ప్రయత్నించినా చంద్రబాబు నాయుడు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ తరువాత కొద్ది రోజులకు అప్పటి మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహాయంతో అసెంబ్లీ లో జీరో హావర్ సమయంలో కలిసేలా చేశాడు. అయినా చంద్రబాబు నాయుడు నాతో డైరెక్టుగా నావైపు చూసి మాట్లాడకుండా, తన సెక్రటరీ ఎస్ వి ప్రసాద్ వైపు చూసి మాట్లాడుతూ ప్రాజెక్ట్ సైజు ఎంత అని అడిగాడు. నేను 20 కోట్లు అని చెప్పాను. వెంటనే సీఎం నాయుడు నాకు టైం లేదు, నేను రాలేను అని చెప్పేశాడు.

అప్పుడు నేను సార్ ప్రధానమంత్రి వస్తానన్నారు, ప్రధాని వస్తున్నప్పుడు సీఎం లేకపోతే ప్రోటోకాల్ ప్రకారం బాగుండదు అన్నాను. ఆ మాటకు, అయితే ఏమి "మేమే ప్రధానమంత్రులను చేస్తాము" అని నాయుడు అన్నారు. దానితో నేను అక్కడినుండి వచ్చేసి పీఎం ఆఫీసుకు ఫోన్ చేసి ఒక పదంలోనే చెప్పాను. సార్ సీఎం గారికి ఆ రోజు రావడం కుదరదట. ఆ విషయాన్ని ముందుగానే ఊహించిన పీఎం ఓకే నువ్వు ఏర్పాట్లు చేసుకో రేణుకా చౌదరి వస్తుంది అన్నారు. రేణుకా చౌదరి వచ్చింది ఆ వ్యాక్సిన్ ను లాంచ్ చేసింది. ఆ సమయంలో ఆమె అన్న ఒక్క మాటతో నా కష్టాలు, బాధలు అన్నీ ఎగిరిపోయాయి. ఆమె ఇలా అంది, " వరప్రసాద్ రేపు ఈ వ్యాక్సిన్ వేసుకునే ప్రతి ఒక్క చిన్నారి తల్లి నిన్ను బాగుండాలని ఆశీర్వదిస్తుంది. అంతకు మించిన ఆశీర్వాదం ఇంకేముంటుంది" అని... ఈ యొక్క చిన్న సంఘటనను బాధాతప్త హృదయంతో చెప్పుకున్నారు వరప్రసాద్.

ఇంతకన్నా బాధపడే విషయం మరొకటి ఉండదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంతో కష్ట పడి ఒక వ్యాక్సిన్ ఒక తెలుగు వాడు కనిపెడితే, దాన్ని చూసి ఎంకరేజ్ చేయాల్సింది పోయి, ఇలా రాజకీయంగా సపోర్ట్ చేయకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి వరప్రసాద్ పై రీసెంటుగా ఈయన వ్యాక్సిన్ వేసుకోను అని చెప్పారని ఆరోపణ వచ్చింది. వాస్తవంగా ఆయన చెప్పింది ఏమిటంటే కరోనా వ్యాక్సిన్ ను శాంత  బయోటెక్ చేయలేకపోయింది. ఎందుకంటే ప్రస్తుతం ఇది విదేశాలతో టై అప్ అయి ఉండడం వలన, వరప్రసాద్ కేవలం మైనర్ పార్టనర్ మాత్రమే. వీళ్ళ సంస్థ చెబుతున్న ప్రకారం, వ్యాక్సిన్ అంటే సరిగ్గా ఉండాలి . ఒకసారి తయారుచేసాక మళ్ళీ దానిపై ఎటువంటి అనుమానాలు ఉండకూడదు. అందుకే ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతానికి పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పింది.  ఆ కారణంగా నేను కేవలం స్వదేశీ వ్యాక్సిన్ తీసుకుంటాను అన్నారు. ఆ విషయాన్ని పట్టుకుని అసలు వ్యాక్సిన్ తీసుకోను అన్నట్లుగా చిత్రీకరించారు. అందుకే మన నాయకులు వారికి నచ్చిన వారినే సపోర్ట్ చేస్తారు. నచ్చని వారిని, వారి పరిశ్రమలను ఎదగనివ్వరు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: