ఈ క్రమంలోనే దేశం నలుమూలల నుంచి ఆనందయ్య మందు కోసం అందరూ క్యూకట్టారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆనందయ్య ముందు మంచిదేనా అన్న విషయంపై కూడా పరిశోధనలు జరిపి ఆనందయ్యా ముందు ఎలాంటి హానికరమైనది కాదు అంటూ స్పష్టం చేసారు. ఈ క్రమంలోనే ఆనందయ్య మందు అందుబాటులోకి వచ్చింది. అయితే కంటి లో వేసే డ్రాప్ కి మాత్రం ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. ఆనందయ్యా తయారుచేసిన ఆయుర్వేదిక ఐ డ్రాప్స్ కంట్లో వేసుకున్న తర్వాత ఎంత తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పటికీ కేవలం నిమిషాల వ్యవధిలోనే మళ్లీ ఆరోగ్యవంతులుగా మారిపోతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఇక ఆనందయ్య కంటి మందు కూడా మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇటీవలే ఆనందయ్య కంటిలో వేసే చుక్కల మందు పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. ఆనందయ్య కంటి ముందు కు సంబంధించినవి నివేదిక అందిందని.. దీనికి సంబంధించి ఎలాంటి దుష్ప్రభావాలు లేవు అనే విషయం తేలింది అంటూ ప్రభుత్వం హై కోర్టుకు తెలిపింది. ఈ మందు ప్యాకింగ్, నిల్వలకు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఆ తర్వాత కంట్లో వేసే మందు పంపిణీ చేస్తాము అంటూ ప్రభుత్వం తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి