బంగ్లాదేశ్ వెళ్లిన తర్వాత అక్కడ తను ప్రేమించిన యువతిని తాను పెళ్లి చేసుకుని.. మళ్ళీ భారత్లోకి సరిహద్దు వచ్చే సమయంలో మాత్రం చివరికి సైన్యానికి దొరికిపోయాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్కతాలో వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ లోని మాదాపూర్ సరిహద్దుల వద్ద జూన్ 26వ తేదీన ఓ జంట అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో అధికారులు గుర్తించి అప్రమత్తమైన అధికారులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా యువకుడు బెంగాల్లోని నదియా జిల్లా బలపూర్ చెందిన జై కాంతో చంద్ర రాయ్ గా గుర్తించారు. ఇక అతని వెంట ఉన్న యువతి బంగ్లాదేశ్కు చెందిన తొమ్మిదేళ్ల పరిణితి గా గుర్తించారు బిఎస్ఎఫ్ అధికారులు.
ఇద్దరికీ ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. చివరికి పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది. ఈ క్రమంలోనే ఇక తన ప్రేయసిని పెళ్లి చేసుకోవాలనుకున్న చంద్ర రాయ్ ఒక మధ్యవర్తి సహాయంతో మార్చి 8వ తేదీన బంగ్లాదేశ్ పెళ్లి 10వ తేదీన పరిణితిని పెళ్లి చేసుకున్నాడు. జూన్ 25 వరకు అక్కడే ఉన్నాడు. ఇక స్వదేశానికి రావాలని భావించి సరిహద్దులు దాటి భారత్ లోకి వచ్చేసాడు. ఈ క్రమంలోనే బిఎస్ఎఫ్ అధికారులు ఇక సరిహద్దుల్లో ఈ జంటను అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటం గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సరిహద్దు ప్రేమికుడు తీరు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి