ఏపీలో అధికార వైసీపీలో పదవుల పందారం ప్రారంభంకానుంది. ఇప్పటికే అటు శాసనసభ్యులు కోటాలో ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ లు ఖాళీ అయ్యాయి. మొత్తం 11 ఎమ్మెల్సీలతో పాటు నాలుగు రాజ్యసభ స్థానాలకు వైసీపీలో ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. ఈ క్రమంలోనే నామినేటెడ్ పదవుల పందేరం కూడా ఉండడంతో పదవుల రేసులో ఉన్న వారి సంఖ్య లెక్కకు మిక్కిలి గా ఉంది. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన దాడి ఫ్యామిలీ అన‌కాప‌ల్లి అసెంబ్లీ సీటు ఆశించింది. అయితే జగన్ దాడి వారసుడు రత్నాకర్ కు విశాఖ నార్త్ సీటు కేటాయించారు.

ఆ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడంతో దాడి ఫ్యామిలీ ఆ పార్టీ లోకి వెళ్లి పోయింది. అనంతరం గత ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీ లోకి జంప్ చేసింది. దాడి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లోకి రావడంతో జగన్ ఆయనను పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నార‌ట. విచిత్రమేంటంటే దాడి తనయుడు రత్నాకర్‌ తాను సైతం ఎమ్మెల్సీ రేసులో ఉన్నానని చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. దాడి వ‌య‌స్సు పైబ‌డ‌డంతో ఇదే ఆఖరి అవకాశమని ఎమ్మెల్సీ పదవి నాకే కావాలి అని అడుగుతున్నారట.

అయితే రత్నాకర్ మాత్రం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉందని... ఇప్పుడు ఏదో ఒక పదవి రాకపోతే రాజకీయంగా వెన‌క  పడిపోతానని ఆందోళన చెందుతున్నారట. అందుకే ఎమ్మెల్సీ పదవి తనకే కావాలని రత్నాకర్ సైతం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ర‌త్నాక‌ర్ క‌నీసం విశాఖ డీసీసీబీ చైర్మన్ పదవి అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నార‌ట‌. అయితే జగన్ దాడి కుటుంబానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెండు పదవులు ఇస్తారా ? అంటే డౌటే ?  మరి దాడి కుటుంబానికి పదవి ఇవ్వాల‌నుకుంటే అది తండ్రి , కొడుకుల్లో ఎవ‌రికి ద‌క్కుతుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: