అంతేకాదు ఒంటరి మహిళలనే టార్గెట్ గా చేసుకొని ఎన్నో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఒంటరి మహిళలు టార్గెట్గా చేసుకుని అటు తెలంగాణలోని పలు ప్రాంతాలలో చైన్ స్నాచింగ్ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కొన్నాళ్ల పాటు మహిళలు ఒంటరిగా రోడ్డుమీద తిరగాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు ద్విచక్రవాహనంపై రావడం మహిళ మెడలో ఉన్న గొలుసు లాక్కుని పోవడం లాంటివి చేశారు. అయితే కేవలం పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా ఇటీవల కాలంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇటీవలి కాలంలో వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఇద్దరు మహిళలను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ లో ఇద్దరు కిలాడీలు ను అరెస్టు చేసిన పోలీసులు కటకటాల వెనక్కి తోశారు. బస్సులు ఆటోలలో ప్రయాణించే ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని ఎన్నో రోజుల నుంచి దోపిడీకి పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. గత కొన్ని రోజుల నుంచి పోలీసులు వరుసగా ఫిర్యాదులు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇక నిఘా ఏర్పాటు చేసి ప్లాన్ ప్రకారం ఇద్దరు మహిళలు పాల్గొన్నారు. వీరి దగ్గర నుంచి నాలుగు లక్షల విలువైన 473 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నాలుగు సెల్ఫోన్లు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇద్దరు నిందితులు కడప జిల్లాకు చెందిన దివ్య కవిత గా గుర్తించారు పోలీసులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి