దీంతో స్పందించిన ట్విట్టర్.. క్లారిటీ ఇచ్చింది. రాహుల్ ట్విట్టర్‌ను నిలిపివేయలేదని.. సర్వీస్‌లో భాగంగా తాత్కాలికంగా లాక్ అయినట్లు తెలిపింది. ఆ అకౌంట్ తిరిగి యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్‌పై చర్యలకు ప్రధాన కారణం.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఫిర్యాదు. ఢిల్లీలో హత్యాచారం జరిగిన బాలిక కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆ సమయంలో తీసిన ఫోటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఇది పోక్సో చట్టం నిబంధనలను అతిక్రమిస్తోందని జాతీయ బాలల హక్కుల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబం వివరాలను బహిరంగ పరిచారంటూ తప్పు పట్టింది. పోస్ట్‌ను వెంటనే తొలగించాలని ట్విట్టర్‌ను ఆదేశించింది.
దీంతో ట్విట్టర్ చర్యలు చేపట్టగా.. అది లాక్ అయినట్లు చెబుతోంది. అయితే గతంలో ట్రంప్ విషయంలోనూ ట్విటర్ ఇలాగే స్పాందించింది. తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ.. ఏకంగా ట్రంప్ ట్వీట్లను డిలీట్ చేసింది ట్విటర్. ఐనప్పటికే ట్రంప్.. అలానే వ్యవహరించడం తో.. ఫైనల్ గా ట్విట్టర్ అకౌంట్ కూడా లేపేసింది. ఇదే తరహాలో రాహుల్ గాంధీ వ్యవహరిస్తే.. ట్రంప్ ను టార్గెట్ చేసినట్లే.. రాహుల్ ను ట్విటర్ చేసే అవకాశాలు లేక పోలేదు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ విషయంలో.. రాహుల్ గాంధీ చాలా జాగ్రత్తగా ఉండక తప్పని పరిస్థితి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి