రక్షాబంధన్.. అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని తెలిపే పండుగ  అన్న కోసం చెల్లి.. చెల్లి కోసం అన్న ఎప్పుడు అండగా నిలబడాలి అని తెలిపే పండుగ రక్షాబంధన్. ప్రతి అన్నాచెల్లెళ్లకు ఈ రక్షాబంధన్ పండుగ ఎంతో ప్రత్యేకమైనది.  సామాన్యులైన సెలబ్రిటీలు అయిన గొప్ప రాజకీయ నాయకులైన ఈ రక్షాబంధన్ పండుగను ఎంతో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు.  ఇక ప్రతి చెల్లి కూడా అన్నయ్యకు రాఖీ కడుతూ ఉంటుంది.  అటు రాజకీయాల్లో కూడా ఎంతోమంది అన్నా చెల్లెలు మధ్య ఉన్న అనుబంధంతో ఎంతోమంది ని ఆకర్షించారు.  అన్న చెల్లెలు ఒకరికి ఒకరు అండగా నిలబడాలని కష్టం వచ్చినప్పుడు రక్షగా ఉండాలని తెలిపే విధంగా ఉన్నారు.



 అలాంటి వారిలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇక ఆయన చెల్లెలు షర్మిల కూడా ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అన్న కోసం చెల్లి చెల్లి కోసం అన్న ఎన్నోసార్లు రక్షగా  నిలబడ్డారు. ముఖ్యంగా ఇక తండ్రి వైయస్సార్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారు జగన్. ఈ క్రమంలోనే ఇక తండ్రి తరహాలోనే పాదయాత్ర ప్రారంభించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ అక్రమ ఆస్తుల కేసులతో జగన్ను జైలుకు పంపింది.  అలా పంపించడం ద్వారా ఇక వైసిపి పార్టీని కుప్పకూలిపోయేలా చేయాలని అనుకుంది.  అలాంటి సమయంలో ఇక అన్నకు రక్షగా నిలబడింది చెల్లెలు షర్మిల.



 అప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలలో అనుభవం లేని షర్మిల అన్న జైలుకు వెళ్ళగానే ప్రజల్లోకి అడుగు పెట్టింది. ఏకంగా పాదయాత్రను ముందుకు నడిపించింది. ఇక పార్టీ నేతలు అందరిలో ధైర్యాన్ని నింపుతూ కొన్ని రోజుల పాటు ఏకంగా పార్టీ అధినేత లాగా నిర్ణయాలు తీసుకుంది షర్మిల. ఇలా షర్మిల అన్న పార్టీని నిలబెట్టడం వల్లే ఆ తర్వాత భారీ మెజారిటీతో వైసిపి గెలవటం జరిగింది. ఇలా కష్ట సమయంలో అన్నకు రక్షణగా నిలబడి ఏకంగా అన్న ముఖ్యమంత్రి కావడం లో కీలక పాత్ర పోషించింది వైయస్ షర్మిల. ఇలా జగన్ షర్మిల బంధం ఎప్పుడు అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: