జైలు పై హెచ్.ఐ.వి పంజా ?

కోవిడ్-19మహమ్మారి  ప్రళయ గర్జన నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ప్రజల పై  బాంబు పేలింది. పాత వైరస్ కొత్త గా జూలు విదిల్చుకుని ప్రజల పై పంజా విసురు తోంది. అదే హెచ్.ఐ.వి. ఇటీవలి కాలంలో  అంతగా ప్రాచుర్యంలో లేని ఈ వైరస్ మరలా ప్రజలపై తన ప్రతాపాన్ని చూపుతోంది. ఉత్తర భారత దేశంలో ఈ వైరస్ ఎక్కవగా సోకుతోంది. అస్సాం రాష్ట్రం హెచ్.ఐ.వి వైరస్ తాకిడికి విలవిలలాడుతోంది. అస్సాం రాష్ట్రం లోని నౌగావ్ కేంద్ర కారాగారంలో ఈ వైరస్ తిష్ట వేసినట్లు తెలుస్తోంది. ఈ కారాగారంలో ఏకంగా 85 మందికి ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు ప్రకటించాయికూడా. నౌగావ్  ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్. సి. నాథ్ ఈ  విషయాన్ని ధృవీకరించారు. నౌగావ్   ప్రత్యక జైలులో నలభై ఐదు మందికి, సాధారణ జైలులో నలభై మందికి ఈ వైరస్ బారిన పడ్డారని తెలిపారు. మరికొంత వంది ఖైదీల కు నిర్వహించిన వైద్య పరీక్షల వివరాలు అందవలసి ఉందని కూడా డాక్టర్ నాథ్ తెలిపారు.
జైలు అధికారుల ఈ విషయంలో తమను తాము సర్థించుకుంటున్నారు.  ఖైదీలందరూ  మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారని, వారంతా ఇన్ జక్షన్ రూపం లో వాటిని స్వికరిస్తారని తెలిపారు. ఒకరు వేసుకున్న ఇన్ జక్షన్ మరోకరు వేసుకోవడం వల్ల వారందరూ హెచ్.ఐ.వి బారిన పడ్డారని తెలిపారు. జైలులో ఖైదీలుగా ఉన్న వారికి ఇన్ జక్షన్లు ఎలా అందుబాటులో వచ్చాయి అన్న విషయం పై వారు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
ఇక్కడి ఖదీలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటామని జైలు సిబ్బంది తెలిపారు. నోగావ్ జైలులో ఖైదీలకు హెచ్.ఐ.వి సోకడం పై ప్రభుత్వం స్పందించింది. దీనిపై విచరణకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది. నివేదికను త్వరగాఇవ్వాలని అదేశించింది. అస్సాంలో హెచ్.ఐ.వి. కేసులు తగ్గాయని ప్రభుత్వం గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు ఎనిమిది శాతం కేసులు తగ్గాయని తెలిపింది.  2019 సంవత్సరంలో  21,223 కేసులు ఆ రాష్ట్రంలో  నమోదు కాగా, ఈ ఏడాది పంతోమ్మిది వేేల కేసులు మాత్రమే నమోదయ్యాయని ప్రకటించింది. ఈ ప్రకటనచేసిన కొద్ది రోజులకే  నౌగావ్ జైలు పై హెచ్.ఐ.వి పంజా విసిరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

hiv