ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకులకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇటీవలే ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారిపోయాయి. ప్రస్తుతం కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె సుధాకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆధునిక భారతీయ మహిళలు ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పెళ్లి జరిగిన తర్వాత కూడా పిల్లలను కనడానికి నేటి రోజుల్లో మహిళలు ఇష్టపడటం లేదని సరోగసీ ద్వారా సంతానం పొందడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అంటూ ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లో పాల్గొన్నారు ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్. ఇక ఈ కార్యక్రమంలో ఈ హాట్ కామెంట్స్ చేశారు. ఈ విషయం చెబుతున్నందుకు క్షమించండి ఆధునిక భారత మహిళలు చాలామంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. వివాహం చేసుకున్నప్పటికీ పిల్లలను కావడానికి ఇష్ట పడటం లేదు సరోగసీ పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వాలి అని అనుకుంటున్నారు ఇలాంటి ఆలోచన విధానం ఏమాత్రం మంచిది కాదు అంటూ కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ వ్యాఖ్యలు చేయగా మంత్రి వ్యాఖ్యలపై ప్రస్తుతం మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. మహిళలను కించపరిచే విధంగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ విమర్శలు చేస్తున్నారు. వెంటనే మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి