చైనా విస్తరణ ధోరణితో ఇప్పటికే ఎన్నో దేశాలతో వివాదాలు పెట్టుకుంది. కనిపించిన భూభాగాన్ని మొత్తం తమ దేశానికి చెందినది అంటూ ఆరోపిస్తూ ఎన్నో దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. కాగా ఇప్పటికే భారత్ ఆస్ట్రేలియా జపాన్ దేశాలతో సరిహద్దుల్లో వివాదం పెట్టుకొని పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చింది అన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి పొరుగుదేశమైన తైవాన్ ను తమదేశంలో కలుపుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు తైవాన్ తో భారత్ అమెరికా లాంటి దేశాలు సంబంధాలు కొనసాగించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటే..  తైవాన్ తమ దేశంలో భూభాగం..  తైవాన్ జోలికి రావద్దు అంటూ స్టేట్మెంట్ లు ఇస్తోంది చైనా.



 ఇలా పలుమార్లు తైవాన్ ను తమ దేశంలో కలుపుకోవడానికి ప్రయత్నాలు కూడా చేసింది. గత కొన్ని రోజుల నుంచి చైనా వ్యవహరిస్తున్న తీరు మాత్రం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. దారుణంగా తైవాన్ గగనతలం పై చైనా కు సంబంధించిన యుద్ధ విమానాలను భారీ సంఖ్యలో పంపించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తైవాన్ కు మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో  సైలెంట్ గా ఉన్న చైనా ఇక ఇప్పుడు జో బైడెన్ అధికారంలోకి రావడంతో రెచ్చిపోయి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుత ప్రపంచ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది.



 అయితే చైనా వ్యవహారశైలిపై చిన్న దేశం అయినప్పటికి తైవాన్ ఘాటుగానే స్పందించింది.  తైవాన్ ను  తమ దేశంలో కలిపేసుకోవాలి అనుకుంటున్న చైనాకు తైవాన్ అధ్యక్షురాలు కౌంటర్ ఇచ్చారు  చైనా ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చిన ఎట్టి పరిస్థితుల్లో తలవంచబోము అంటూ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య రక్షణలో తాము ఎప్పుడూ ముందు ఉంటానని తెలిపారు తైవాన్   అధ్యక్షురాలు. తైవాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ వాఖ్యలు చేసారు. చైనా ఇప్పటికైనా తమ తీరు మార్చుకొనేలా ఆశాభావం వ్యక్తం చేశారు ఆమె. దేశ రక్షణకు తాను కట్టుబడి ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: