ప్ర‌జా స్వామ్యం దేశంలో నిర‌స‌న అన్న‌ది ప్రాథ‌మిక హ‌క్కు. హ‌క్కుల‌కు భంగం వాటిల్లేలా చేయ‌డ‌మే పెద్ద త‌ప్పు. జ‌గ‌న్ ఆ త‌ప్పు ప‌దే ప‌దే చేస్తున్నారు. ప్ర‌జ‌లు మాత్రం ఇవ‌న్నీ గమ‌నిస్తూ, బాబుపై సానుభూతి కురిపిస్తున్నారు. తిట్ల తీరును ప‌ట్టించుకోవడం లేదు స‌రిక‌దా! బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం కాక‌పోయినా పోరాడే తీరు బాగుంద‌ని ఇంకొంద‌రు ప్ర‌శంసిస్తున్నారు. ఇంకా ప‌లు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఇదే రీతిలో ఎక్క‌డా తలొగ్గ‌కుండా పోరాటం చేయాల‌ని కోరుతున్నారు.


అధికారం ఉన్నా లేకున్నా స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌డం అన్న‌ది రాజ‌కీయ పార్టీల నైజం. ఇదే క్ర‌మంలో విశాఖ కేంద్రంగా సాగ‌వుతున్న వేల కోట్ల రూపాయ‌ల విలువ చేసే గంజాయి పై నియంత్ర‌ణ అవ‌స‌రం అని, దేశంలో ఎక్క‌డ ఏ కేసు న‌మోదు అయినా దాని మూలాలు విశాఖ మ‌న్యంలో ఉన్నాయ‌ని పేర్కొంటూ టీడీపీ నేత ప‌ట్టాభి మాట్లాడారు. ఇదే లైవ్ లో ముఖ్య‌మంత్రిని త‌న స్థాయిని మ‌రిచి కొన్ని మాట‌లు అన్నారు. ఇవే ఇప్పుడు వివాదం అవుతున్నాయి. ముఖ్య‌మంత్రి ని తిట్ట‌డం అటుంచితే స‌మ‌స్య నుంచి డైవ‌ర్ష‌న్ కోస‌మే వైసీపీ ఇలా భౌతిక దాడుల‌కు పాల్ప‌డుతోంద‌ని టీడీపీ అంటోంది.  ఇదెంత మాత్రం భావ్యం కాద‌ని చెబుతోంది.

ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజ‌ధానిలో నిర‌శ‌న దీక్ష చేప‌ట్టారు. 36 గంట‌ల పాటు సాగనున్న ఈ దీక్ష‌కు రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణుల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాల‌యం పై వైసీసీ అభిమానులు దాడులు చేసిన ఘ‌ట‌న కు సంబంధించి త‌న నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఈ దీక్ష‌కు కూర్చొన్నారు చంద్ర‌బాబు. ప్ర‌జా స్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో పాల‌న ఉంద‌న్న ప్ర‌ధాన అభియోగంతో చంద్ర‌బాబు ఈ త‌ర‌హా నిర‌స‌నకు పూనుకున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ కార్యాల‌యానికి సీనియ‌ర్ లీడ‌ర్లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున చేరుకుని, అధినేత‌కు అండ‌గా నిలిచారు. ఇదంతా బాగానే ఉన్నా చంద్ర‌బాబు దీక్ష‌కు జ‌నం మద్ద‌తు ల‌భిస్తుందా?

గ‌తంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌తి దీక్ష‌కూ ఆశించిన స్థాయిలో ప్రజా మ‌ద్ద‌తు దక్క‌లేదు. కొన్నింటికే భావోద్వేగాల‌కు సంబంధించి మాట్లాడిన వాటికే అనూహ్య రీతిలో ప్ర‌జా మ‌ద్ద‌తు వ‌చ్చింది. ఇప్పుడు చంద్ర‌బాబు దీక్ష కార‌ణంగా జ‌నం ఏమ‌నుకుం టున్నారో చూద్దాం. టీడీపీ కార్యాల‌యంపై , ఇత‌ర ఆస్తుల‌పై దాడులు చేయ‌డం త‌ప్పే అని ఈ నేప‌థ్యంలో నిర‌స‌న తెల‌యజేయ డం మంచిదేనని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ రోజు నిర‌స‌న‌ల‌తోనే వైసీపీ స‌ర్కారుకు అంత మంచి పేరు వచ్చిందని, వీలున్నంత మేర‌కు ప్ర‌తి సోమ‌వారం జిల్లా క‌లెక్ట‌రేట్ల ఎదుట నిర‌స‌న దీక్ష‌ల‌కు సై అనేది వైసీపీ అని,అప్పుడు తాము ఎవ్వ‌రినీ అడ్డుకోలేదు అని, కానీ త‌మ‌పై మాత్రం భౌతిక దాడుల‌కు సైతం వెనుకంజ వేయ‌డం లేద‌ని టీడీపీ అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: