భారతీయ ప్రయాణీకులకు బ్రిటన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి ఐసోలేషన్ అవసరం లేదన్న బ్రిటన్.. అంతర్జాతీయ రాకపోకల సౌలభ్యానికి కొవాగ్జిన్ ను గుర్తించినట్టు వెల్లడించింది. ఈ నెల 22 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని బ్రిటన్ పేర్కొనగా.. కొవాగ్జిన్ తో పాటు చైనాకు చెందిన సినోవాక్, సినో ఫార్మ్ కూ గుర్తింపు ఇచ్చినట్టు తెలిపింది.

.భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ కు త్వరలోనే గుర్తింపు ఇవ్వనున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. ఈ నెలాఖరులోగా కొవాగ్జిన్ కు గుర్తింపు దక్కనున్నట్టు తెలుస్తుండగా.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిని తమ దేశంలోనికి అనుమతించనున్నట్టు బ్రిటన్ తెలిపింది. దీంతో ఈ నెల 22నుంచి రెండు డోసులు తీసుకున్న భారతీయులు ఆ దేశానికి వెళ్లవచ్చు. అక్కడ ఎలాంటి క్వరంటైన్ నిబంధనలు వర్తించవు. .

ఇక గడిచిన 24గంటల్లో మన దేశంలో 10వేల 126కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 3కోట్ల 43లక్షల 77వేల 113కు చేరింది. తాజాగా 332 మంది వైరస్ తో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 4లక్షల 61వేల 389గా ఉంది. ఇక కొత్తగా 11వేల 982మంది మహమ్మారి నుంచి బయటపడగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3కోట్ల 37లక్షల 75వేల 86గా ఉంది. ప్రస్తుతం దేశంలో లక్షా 40వేల 638యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు 109కోట్ల 8లక్షల 16వేల 356వ్యాక్సిన్ డోసులు వేశారు.

మరోవైపు రష్యా, జర్మనీతో పాటు చైనాలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ముఖ్యంగా చైనాలోని అత్యధిక రాష్ట్రాల్లో వందలమంది కరోనా బారిన పడ్డారు. ఇక తొలికేసు వెలుగుచూసిన వుహాన్ నగరంలో గతంలో కంటే ఇప్పుడే అధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించి.. చికిత్స అందిస్తోంది. మరోవైపు రష్యాలో నిత్యం 1,100కు పైగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
 
















మరింత సమాచారం తెలుసుకోండి: