ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని ముందుకు నడిపించే విషయంలో పవన్ కళ్యాణ్ కంటే కూడా నాదెండ్ల మనోహర్ కాస్త దూకుడు వ్యవహరించడం పార్టీ వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో పట్టు పెంచుకునే కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం వంటివి ఈ మధ్యకాలంలో ఆసక్తిని రేపుతున్నాయి. రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు నాదెండ్ల మనోహర్ అనే ఒక చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు వెళ్లడం భారతీయ జనతా పార్టీతో సంబంధం లేకుండా పోరాటం చేయడం వంటివి కాస్త ఆసక్తి రేపుతున్న అంశాలుగా చెప్పాలి.

భారతీయ జనతాపార్టీ సహకరించిన లేకపోయినా సరే తాను ఎక్కడా కూడా వెనక్కు తగ్గే అవకాశం లేదని పవన్ కళ్యాణ్ వద్ద కూడా నాదెండ్ల మనోహర్ స్పష్టంగా చెప్పారని అంటున్నారు. కొన్ని కొన్ని కీలక అంశాల్లో నాదెండ్ల మనోహర్ కు ఈ మధ్యకాలంలో పార్టీ వ్యవహారాల మీద పట్టు పెంచుకోవడమే కాకుండా చాలామంది నియోజకవర్గాల ఇన్చార్జిలను కనీసం పవన్ కళ్యాణ్ వద్ద కూడా చెప్పకుండా మార్చాలని భావిస్తున్నారని అంటున్నారు. చాలామంది కీలక నాయకులు ఈ మధ్యకాలంలో దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడంతో నాదెండ్ల మనోహర్ వాళ్లకు అన్ని విధాలుగా కూడా సహకారం అందిస్తున్నారని సమాచారం.

రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ మీద పట్టు పెంచుకునే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడే అవకాశం ఉండటంతో చాలామంది నాయకులు పవన్ కళ్యాణ్ కాస్త వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉందని నాదెండ్ల మనోహర్కు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తే పార్టీ కోసం ముందు నుంచి కష్టపడే కొంతమంది నాయకులు భయ పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అయితే నాదెండ్ల మనోహర్ చేతిలో పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశముందని వచ్చే ఏడాది నాదెండ్ల మనోహర్ ద్వారా పాదయాత్ర లేదా బస్సుయాత్ర చేయించి ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని ఈ మేరకు ఆయనతో చర్చలు జరిపారని ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: