యావత్ భారతావని ఒక్క సారిగా కలవర పడింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు నివ్వెర పోయారు. దీనికి కారణం న్యాయమూర్తులు ఒకరిపై మరోకరు నిందలు వేసుకున్నారు.అదీ బహిరంగంగా.. ఈ జడ్జీల వార్ ఎంత వరకూ వెళుతుందనేది ఇప్పుడు ప్రజల మదిని తొలిచి వేస్తున్న ప్రశ్న.
మద్రాసు హై కోర్టు విశ్రాంత న్యాయ మూర్తి ఒక వైపు... ప్రస్తుం అమరావతి హైకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న న్యాయమూర్తులు మరో వైపు. ఫక్తు రాజకీయ నాయకుల లాగా ఒకరి పై మరోకరు ధూషణలు చేసుకున్నారు. అయితే న్యాయమూర్తులు కదా భాషలో కొంత సంయమనం పాటించారు. అంతవరకూ సంతోషం. ఇంతకీ ఎవరు వారు ఏమని విమర్శించుకున్నారు ...జస్ట్ ఏ లుక్
జస్టిస్ చంద్రు... ఇటీవల లైమ్ లైట్ ఉన్న మాజీ న్యాయమూర్తి. దక్షిణ భారతావనిలో సంచలనాలు నమోదు చేసిన జైభీం ఫేమ్. ఆయన ఇటీవల పలు కార్యక్రమాలలో పాల్గోననేందుకు విజవాడ వచ్చారు. తన దైన శైలిలో ప్రసంగం చేశారు. న్యాయవాద వృత్తి అన్నది సేవలో భాగం కావాలని, డబ్బుల కోసం న్యాయవాది వృత్తి చేయకూడదని ఆయన తాను పాల్గోన్న సమావేశంలో పేర్కోన్నారు. అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లోజ రుగుతున్న పరిణామాలపై తనదైన వ్యాఖ్యలుచేశారు. అమరావతి హై కోర్టు దూకుడుగా వ్యవహరిస్తోందని కూడా ఆయన పేర్కోన్నారు. మీడియా జనంసహజం గానే ఈ వ్యాఖ్యలకు విశేషమైన ప్రాచుర్యం కల్పించారు. అదే రోజు జస్టిస్ చంద్రు వ్యాఖ్యల పై మిశ్ర స్పందన వచ్చింది.
జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలు అమరావతిలోని హై కోర్టుకు, అక్కడ పని చేస్తున్న న్యాయమూర్తులకు తీవ్ర మనస్తాపాన్ని కలిపించాయి. దీంతో వారు వేరు వేరుగా ప్రసార మాధ్యమాలకు ఎక్కారు. తమ ఆవేదనను వెళ్లగక్కారు. జస్టిస్ దేవానంద్ ఒకఅడుగు ముందుకు వేసి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలను ఖండించడం తో పాటు, అమరాతి హై కోర్టు తీసుకున్నచర్యలు, అలా యాక్షన్ తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితలను మీడియాకు వివరించారు. ఏ న్యాయమూర్తి అయినా తప్పు చేస్తే సరైన మార్గం, సరైన రీతిలో
పేర్కోనాలని, మొత్తం హై కోర్టును నిందించడం సరికాదని జస్టిస్ దేవానంద్ పేర్కోన్నారు. న్యాయమూర్తులకూ రక్షణ ఉంటుందనే విషయాన్ని జస్టిస్ చంద్రు మరచిపోయినట్లున్నారని, అమరావతి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకునే వ్యక్తులే ఇ లాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని హై కోర్టు సీజే పేర్కోన్నారు.
గతంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెంది ఓ సుప్రీం కోర్టు న్యాయమూర్తి , ప్రస్తుతం ఆయన విశ్రాంత న్యాయమూర్తి చలమేశ్వర్ న్యాయ వ్యవస్థ పై వ్యాఖ్యలు చేశారు. అవి దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తెలుగు రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పై తాజాగా విశ్రాంత న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. ప్రతిగా ప్రస్తుత న్యాయ మూర్తులు మీడియాకు ఎక్కారు. ఈ వైపరీత్యం ఎంతకు దారి తీస్తుందో కదా ?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి