కరోనా వస్తే ఏం చేస్తాం.. ఏం చేస్తాం.. హోం ఐసోలేషన్‌లో ఉంటాం.. కరోనా మొదటి వేవ్‌లో ఈ ఐసోలేషన్ పిరయడ్ 14 రోజులుగా ఉండేది..  ఆ తరవాత దాన్ని ఇప్పుడు వారం రోజులకు తగ్గించారు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఓ నాలుగు రోజులు వరుసగా జ్వరం రాకుండా ఉంటే.. లక్షణాలు లేకపోతే.. ఇక ఐసోలేషన్ అయిపోయినట్టే.. కరోనా కూడా మాయం అయినట్టే.. మళ్లీ కరోనా టెస్టు చేయించుకోవాల్సిన  అవసరం కూడా లేదని కేంద్రం ఇటీవల కొత్త మార్గదర్శకాలు కూడా ఇచ్చింది.


అయితే.. ఇప్పుడు ఓ కొత్త షాకింగ్ న్యూస్ తెలుస్తోంది. అదేంటంటే.. కరోనా పాజిటివ్‌గా తేలి పది రోజులు ఐసోలేషన్‌లో ఉన్న తర్వాత కూడా కరోనా వ్యాపిస్తోందట. ఇలా  కనీసం పది మందిలో ఒకరు వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నట్లు తేలిందట. ఈ విషయం చెప్పిందెవరంటే.. బ్రిటన్‌ కు చెందిన
ఎక్సెటర్‌ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ బృందం స్టడీలో తేలిందట. ఈ బృందం ఏం చేసిందంటే.. 176మంది పాజిటివ్‌ వ్యక్తులపై అధ్యయనం చేసింది. వారి సేకరించిన నమూనాలను పరిశీలించింంది. అందులో 13 శాతం మందిలో 10రోజుల తర్వాత కూడా ఇతరులకు కరోనా ఇతరులకు వ్యాపిస్తోందట.


వారిలో ఆ స్థాయిలో వైరస్ ఉందట. మరీ విచిత్రం ఏంటంటే.. ఇంకొంత మందిలో ఏకంగా 68రోజుల వరకు కూడా కరోనా వైరస్ బతికే ఉందట. అయితే ఇది ఆ వ్యక్తులకు హానికరం కాదు. కానీ.. ఈ వైరస్‌ ఇతరులకు సోకే ప్రమాదం అధికంగా ఉంది. అంతే కాదు.. ఇలాంటి వారిని గుర్తించడం కూడా చాలా కష్టమట. రొటీన్‌ గా చేసే ఆర్టీ పీసీఆర్‌లో కూడా ఈ విషయం తెలియదట. వారిని గుర్తించేందుకు కొత్త తరహా టెస్టులు  అవసరమట.


ఇప్పుడు ఈ కొత్త అధ్యయనం మరోసారి మన ఐసోలేషన్ నిబంధనల అమలుపై సందేహాలు కలిగిస్తోంది. అయితే ఇది ఇంకా ఓ అధ్యయనమే. దీనిపై మరింత పరిశోధన జరిగితే కానీ.. ఈ విషయానికి నిరూపణ స్థాయి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: