జగన్మోహన్ రెడ్డిపై ఎగిరెగిరి పడటానికి, జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వదిలే ప్రసక్తేలేదు. అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా జగన్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతుంటారు. అలాంటిది రెండు బర్నింగ్ ప్రాబ్లెమ్స్ పై పవన్ అస్సలు ఎందుకని నోరిప్పటం లేదో ఎవరికీ అర్ధం కావటంలేదు. పైగా పార్టీ తరపున కూడా అధికారికంగా ఎలాంటి మీడియా రిలీజ్ కూడా రాలేదు. ఇదే అందరికీ ఆశ్చర్యంగా ఉంది.
రెండు బర్నింగ్ ఇష్యూస్ అంటే మొదటిదేమో గుడివాడలో క్యాసినో జరిగిందనేది. ఇక రెండోదేమో కొత్త జిల్లాల ఏర్పాటు. గుడివాడలోని కే కన్వెన్షన్లో క్యాసినో జరగలేదని కొడాలి నాని పదే పదే చెబుతున్నారు. అయితే క్యాసినో జరిగిందని టీడీపీ నేతలు వందసార్లు చెబుతున్నారు. ఇవే రుజువులంటు కొన్ని వీడియోలు, ఫొటులో కూడా రిలీజ్ చేశారు. క్యాసినో వివాదాన్ని ఎంత వీలుంటే అంత పెద్దది చేయాలని చంద్రబాబునాయుడు డిసైడ్ అయినట్లన్నారు. అందుకనే పదిరోజులుగా గోల చేస్తునే ఉన్నారు.
మరింతటి కీలకమైన ఇష్యుమీద పవన్ ఎందుకని నోరిప్పలేదో తెలీటంలేదు. మామూలుగా అయితే కామ్ గా ఉండే రకంకాదు. అయినా కామ్ గా ఉన్నారంటే తెరవెనుక ఏదో జరిగిందనే అనుమానాలున్నాయి. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు అంశం కూడా. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని చంద్రబాబు అండ్ కో మొక్కుబడిగానే స్వాగతించారు. కాకపోతే జిల్లా కేంద్రం దూరమని, జిల్లా కేంద్రంగా పలానా పేరు స్ధానంలో మరో పేరు పెట్టాలని డిమాండ్లు చేస్తోంది. బీజేపీ స్వాగతించినా మిగిలిన ప్రతిపక్షాలు పెద్దగా స్పందించటంలేదు.
మరింతటి కీలకమైన అంశంలో కూడా పవన్ ఎందుకని స్పందించటంలేదో అర్ధం కావటంలేదు. ప్రభుత్వ నిర్ణయం మంచిదనో కాదనో ఏదో ఒకటి అయితే చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా పవన్ పైనుంది. అధినేత హోదాలో పవనే స్పందించాలనేమీ లేదు. కానీ పార్టీ తరపున కూడా ఎలాంటి మీడియా రిలీజ్ రాలేదు. జరుగుతున్నది చూస్తుంటే పవన్ విషయంలో తెరవెనుక ఏదో జరిగుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏమి జరుగుతున్నదే ఏమిటో అర్ధం కావటంలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి