తెలుగు సినీ పరిశ్రమకు , ఏపి ప్రభుత్వానికి మధ్య కనపడని టికెట్ల యుద్ధం ఇపుడు ప్రశాంతంగా ముగిసిందనే చెప్పాలి. ఇరువురి మధ్య చర్చలు మీద చర్చలు జరుగగా చివరికి ఒకతాటిపైకి రావడంతో అంతా సర్దుకుంది. తాజాగా టాలీవుడ్ రాజకుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు సైతం సిఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేనండి ఏపి సర్కారు సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం, పెంచడానికి వీలు లేదు అని చెప్పడంతో నిన్న , మొన్నటి వరకు అటు ప్రభుత్వానికి ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి మద్య గరం గరంగా పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. టికెట్ల రేట్ల అంశంలో ప్రభుత్వంపై ఇండస్ట్రీ ప్రముఖులు తమ అసంతృప్తిని తెలిచేస్తు టికెట్ల రేట్ల పెంపు అంశం పై దృష్టి సారించాలని కోరారు.

మెగాస్టార్ చిరు,దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, మహేష్, నారాయణ మూర్తి వంటి సినీ దిగ్గజాలు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి మరి సినీ పరిశ్రమ బిడ్డల జీవితాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ల రేట్ల విషయంలో మరో నిర్ణయం తీసుకుంటే సంతోషం అని కోరారు. మెగాస్టార్ అయితే పలుమార్లు పర్సనల్ గా కలిసి మరి ఈ విషయంపై సిఎం తో చర్చించారు. కాగా ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు శుభవార్తను వినిపించింది. టికెట్ల రేట్ల అంశంలో మరో నిర్ణయం తీసుకుంది.  టికెట్ల రేట్లను నాలుగు కేటగిరీలుగా విభజించింది. అందులో కనీసం 20, గరిష్టంగా 250 గా రేట్ల గా కేటాయించింది.

నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, మల్టిప్లెక్స్ కేటగిరీలుగా థియేటర్ల టికెట్స్ రేట్లను ఫైనల్ చేసింది. ఒక్కో థియేటర్ లో కేవలం రెండే రకాల టిక్కెట్లు ఉండేలా సూచించింది. ప్రీమియం, నాన్ ప్రీమియంగా టికెట్ల రేట్ల నిర్దారణ  చేసింది.. ప్రతి థియేటర్లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియంకు కేటాయించాలని ఆదేశించింది ప్రభుత్వం. విషయం తెలుసుకున్న సినీ తారలు ఒక్కొక్కరుగా సిఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరో మహేష్ బాబు కూడా సోషల్ మీడియా వేదికపై సీఎం స్పెషల్ గా తెలియజేశారు. ఈ సందర్భంగా ఇది వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: