రీసెంట్ గా జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ప్రసంగించిన జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు అధికార పార్టీని గద్దె దింపుతాం అన్న సంచలన వ్యాఖ్యలు చేస్తూనే... ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా.. జాగ్రత్తలు పడతామని చేసిన వ్యాఖ్యలు ఏపి రాజకీయంలో ప్రభంజనం సృష్టించాయి. పవన్ ఘాటు వ్యాఖ్యలు అధికార పార్టీని బాగానే హీటేక్కించినట్లు తెలుస్తోంది. అందుకే హుటాహుటిన శాసన సభా పక్ష సమావేశం జరిగిందని అంటున్నారు. నిజానికి ముందుగా అనుకున్న ప్రకారం ఈ సభకు ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ... సీఎం జగన్ మంగళవారమే నిర్వహించడం గమనార్హం.
అంతేకాదు సభ్యులకు సీఎం జగన్ బ్రెయిన్ వాష్ కూడా చేసినట్లు సమాచారం. ఇకపై ఎమ్మెల్యేల పనితీరులో ఫలితం లేకుండా ఉంటే చర్యలు ఉంటాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరియు రాబోయే ఎన్నికల కోసం టికెట్లు గురించి ఆలోచించాల్సి వస్తుందని గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఓటర్లను పేరు పెట్టి పిలిచే స్థాయిలో నాయకుల కలివిడిగా పనితీరు ఉండాలని దిశానిర్దేశం చేశారట ఏపి ముఖ్యమంత్రి. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నా ప్రజల్లో పార్టీ పై కొన్ని అపోహలు, సందేహాలు, అసంతృప్తి ఉన్నాయన్న మాట వాస్తవం. అభివృద్ధి పెద్దగా జరగడం లేదని, పోలీసుల అధికారం జోరుగా సాగుతోందని, ప్రజాప్రతినిధుల పనితీరు అంతంతమాత్రంగా ఉంటుందని ఇలా చాలా కారణాలే వినపడుతున్నాయి.
మరి వీటన్నిటినీ పాజిటివ్ గా మార్చాలంటే చాలా సమయమే అవసరం. అందుకే రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే సన్నాహాలు సిద్దం చేసుకుని నేరుగా సీఎం రంగంలోకి దిగి నాయకులను పరుగులు పెట్టిస్తున్నట్లు సమాచారం. ఇక మూడేళ్లు తమదైన స్టైల్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే మరియు ఎంపీ లు ఇకపై ప్రజల్లోకి వెళ్లకుంటే వచ్చే ఎన్నికల్లో మొండి చెయ్యి తప్పేలా లేదు. మరి ఈ సీఎం జగన్ వేసిన కొత్త ప్లాన్ లో ఎంత మంది నాయకులు తమ తీరును మార్చుకుని ప్రజలకు అనుగుణంగా పని చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి