అయితే భద్రాచలం ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని నిర్వహింఛే సమయం ఆధారంగానే దేశంలోని అన్ని ఆలయాల్లో కూడా అదే సమయంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్న ఆచారం. అయితే ఇక శ్రీరామనవమి నాడు నిర్వహించే సీతారాముల కల్యాణం రోజున దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు భారీగా భద్రాచలం తరలివస్తుంటారు. సీతారాములకళ్యాణాన్ని తిలకించి తరించి పోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్ల నుంచి మాత్రం భద్రాచలంలో శ్రీరామనవమి భక్తులు లేకుండానే నిర్వహిస్తున్నారు.
కానీ దాదాపు రెండేళ్ల తర్వాత వైరస్ తగ్గుముఖం పట్టడం తో సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తులకు అనుమతి ఇవ్వడం గమనార్హం. దీంతో ఇక రెండేళ్ల తర్వాత అవకాశం ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు అటు భక్తులందరూ కూడా భారీగా తరలి వెళ్లారు. కాగా సీతారాముల కల్యాణోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. ఇక టిటిడి తరఫున పట్టువస్త్రాలు తలంబ్రాలను చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అందించారు.. ఇక భద్రాచలం ఆలయ వీధులన్నీ కూడా భక్త జన సందోహం గా మారిపోయాయి. ఇక మిథిలా స్టేడియం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. కాగా రేపు శ్రీ రామచంద్ర పట్టాభిషేక మహోత్సవం జరుగపోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి