
కొంతమంది అయితే ఇక వాహనాలను వదిలేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. ఇంత భారీ ధర ఉన్న పెట్రోల్ కొట్టుకొని వాహనం నడపడం ఎందుకు అని భావించారు. అయితే ఇటీవల కేంద్రప్రభుత్వం అందరికీ శుభ వార్త చెప్పింది. ఏకంగా పెట్రోల్ డీజిల్ ధరలపై తొమ్మిది రూపాయలు తగ్గించింది. దీంతో ఎంతో మంది సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో విమర్శలు కూడా ఉన్నాయి. పెంచిందేమో కొండంత తగ్గిందేమో చిన్న రాయి అంత అంటూ కొంతమంది విమర్శకులు కూడా చేశారన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తొమ్మిది రూపాయలు తగ్గడంతో హైదరాబాద్ లో ప్రస్తుతం 109 రూపాయలుగా కొనసాగుతుంది లీటర్ పెట్రోల్ ధర.
కానీ మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం 100 కంటే తక్కువగా పెట్రోల్ ధరలు కొనసాగుతున్నాయని చాలా తక్కువ మందికి తెలుసు. ఇలా ఏ రాష్ట్రాల్లో 100 కంటే తక్కువగా కొనసాగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పంజాబ్ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర 96 రూపాయలు కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో 96.41 ఉంది పెట్రోల్ ధర. ఇక గుజరాత్లో 99.8 రూ, హర్యానాలో 98.5 రూపాయలు అస్సాంలో 96 రూపాయలు, జమ్మూకాశ్మీర్లో 99 రూపాయలు, ఉత్తరాఖండ్లో 94.88 రూ, జార్ఖండ్లో 9.8 రూపాయలుగా కొనసాగుతోంది పెట్రోల్ ధర.