యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ  తాజా గా నటించిన చిత్రం 'కార్తికేయ 2' . అయితే  సూపర్ హిట్ సినిమా  'కార్తికేయ' చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.ఇకపోతే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఈ సినిమా సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఇక ఒక పురాతన దేవాలయం నేపథ్యంలోని హారర్ థ్రిల్లర్ గా ఈ సినిమా అత్యధిక ప్రజాదరణ పొందింది. కాగా స్వాతి రెడ్డి  కథానాయికగా నటించిన ఈ సినిమాలోని సస్పెన్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.అయితే  ఈ నేపథ్యంలో ఈ సినిమాకిప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది.

 ఇక ఈ సారి శ్రీకృష్ణ తత్వంపై ఓ మిస్టిక్ స్టోరీని రాసుకున్నాడు దర్శకుడు. అనుపమా పరమేశ్వరన్  కథానాయికగా ఈ భాగం తెరకెక్కుతోంది.ఇక  మొదటి భాగాన్ని మించిన స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండడమే కాకుండా.. పాన్ ఇండియా స్థాయిలో మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇకపోతే జూలై 22న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.ఇదిలావుంటే ఈ సినిమాకి అదిరిపోయే స్తాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.ఇక  థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ కు మొత్తం రూ. 34 కోట్ల ధరపలికింది. కాగా నిఖిల్ లాంటి మీడియమ్ రేంజ్ హీరోకది అత్యధికం అని చెప్పాలి.

 ఇక ఇంతకు ముందు విడుదలైన 'కార్తికేయ 2' ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు అలాగే.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు బ్రహ్మాండమైన స్పందన దక్కింది. పోతే అందులోని విజువల్స్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి.కాగా  గుజరాత్ బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోందని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతోంది.ఇదిలావుంటే  మొదటి భాగానికి మించి ఈ సినిమా విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.ఇకపోతే 'అర్జున్ సురవరం' సినిమా సూపర్ హిట్ తర్వాత నిఖిల్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో మరింతగా హైపు క్రియేట్ అయింది.కాగా  కీరవాణి  తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తుండగా.. సృజనమణి  సంభాషణలు రాశారు. .!!

మరింత సమాచారం తెలుసుకోండి: