టీడీపీ మహానాడు కార్యక్రమం సక్సెస్ అయిందన్న వార్తల తర్వాత వైసీపీ కూడా తమ ప్లీనరీని ఓ రేంజ్ లో జరపాలని నిర్ణయించింది. దీనికి సన్నాహకంగా ముందు నియోజకవర్గాల స్థాయిలో ప్లీనరీలు పూర్తయ్యాయి. ఆ తర్వాత జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు పెట్టుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయి ప్లీనరీ జరగబోతోంది. ఈనెల 8,9 తేదీల్లో ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు జరిగాయి. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న స్థలం దీనికి వేదిక. ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి.

ప్లీనరీ అజెండా ఇదే..
వైసీపీ ప్లీనరీ రెండురోజులపాటు జరుగుతుంది. మొదటి రోజు 5 అంశాలపై చర్చిస్తారు. ఈనెల 8న ప్లీనరీ తొలిరోజు.. ఉదయం 8 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తారు. సరిగ్గా ఉదయం 10 గంటల 10 నిముషాలకు పార్టీ జెండాను వైసీపీ అధ్యక్షుడి హోదాలో జగన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 20 నిమిషాల సేపు సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి జగన్ పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.

పార్టీ అధ్యక్షుడి ఎన్నిక..
ఆ తర్వాత ఉదయం 10గంటల 55నిముషాలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల చేస్తారు. సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ అధ్యక్ష ఎన్నిక ప్రకటన విడుదల చేస్తారు. అందరికంటే ముందు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ ప్రసంగిస్తారు. ప్రసంగం తర్వాత జమాఖర్చుల ఆడిట్ తర్వాత.. పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదన, ఆమోదం ఉంటాయి. ఆ తర్వాత తీర్మానాలు మొదలు పెడతారు. మహిళా సాధికారత దిశ చట్టం మొదటి తీర్మానంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ తీర్మానం ప్రవేశ పెట్టిన అనంతరం మహిళా నాయకులు.. ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్, రోజా , ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి ఆ తీర్మానంపై ప్రసంగిస్తారు. ఆ తర్వాత విద్యపై తీర్మానం ఉంటుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ ఫర్‌, వైద్యం, పరిపాలన-పారదర్శకత, అనే అంశాలపై తీర్మానాలు ప్రవేశ పెడతారు. ఆ తర్వాత తొలిరోజు సమావేశం ముగుస్తుంది. రెండోరోజు ఎక్కువగా ప్రసంగాలపై దృష్టి పెట్టే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: