బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. పవన్ తో పాటు కారు డ్రైవర్, సెక్యూరిటి సిబ్బందిపైన కూడా పోలీసులు కేసులు పెట్టడం ఇపుడ చర్చనీయాంశమవుతోంది. విషయం ఏమిటంటే నరేంద్రమోడీ రాష్ట్రపర్యటనలో ఉండగానే మిత్రపక్షం అధినేతపై పోలీసులు కేసు నమోదుచేయటం. ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం కక్షపూరితంగా కొందరి ఇళ్ళని కూల్చేసిందని పవన్ ఆరోపించారు. ఆరోపించటంతో సరిపెట్టుకోకుండా 5వ తేదీన ఇప్పటం గ్రామానికి వెళ్ళారు.





ఇప్పటం గ్రామానికి ఎలాగ వెళ్ళారంటే కారుపైన కూర్చుని ప్రయాణంచేశారు. కారుపైన కూర్చుని ప్రయాణంచేయటం మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరం. ఏదైనా అవసరంవచ్చి  డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తే పైన కూర్చున్న పవన్ ముందు బాయ్ నెట్ పైకి జారి తర్వాత రెండుచక్రాల మధ్య పడిపోవటం ఖాయం. అప్పుడు దాన్నికూడా తన హత్యకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్రచేసిందని రచ్చ చేయటమే పవన్ ఉద్దేశ్యమో ఏమో. పవన్ కారును పదులసంఖ్యలో వాహనాలు అనుసరించాయి.





కారుపైన కూర్చున్న పవన్ ఎక్కడ పడిపోతారో అన్న టెన్షన్ తో గన్ మెన్లతో పాటు పర్సనల్ సెక్యూరిటి కారుకు రెండువైపుల ఫుట్ రెస్ట్ పైనే నిలబడ్డారు. పవన్ కాన్వాయ్ కారణంగా తాను మోటారు సైకిల్ మీదనుండి పడిపోయినట్లు తెనాలికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు.





ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పవన్, కారు డ్రైవర్, సెక్యూరిటి సిబ్బందిపై కేసులు నమోదుచేశారు. పవన్ కారుపైన ప్రయాణించిన విషయమై జాతీయ మీడియా ఇండియా టు డే ఛానల్ అప్పుడే ఏకి పారేసింది. మోటారు వాహనాల చట్టాన్ని అతిక్రమించారంటు కథనం ఇచ్చింది. షూటింగుకు నిజ జీవితానికి పవన్ కు తేడా తెలీటం లేదంటు మండిపడింది. ఇన్నిరోజులకు శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేశారు.  మోడీ రాష్ట్రంలో ఉండగానే బీజేపీకి మిత్రపక్షమని కూడా చూడకుండా పవన్ పై పోలీసులు కేసు నమోదుచేయటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: