ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఎంతటి ధైర్యవంతుడో తాజాగా బయటపడింది. విజయనగరం జిల్లా పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతు తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఉద్యోగులకు, ఎన్జీవోలకు, టీచర్ల సంఘాలకు భయపడేవాడినని స్వయంగా చెప్పుకున్నారు. అలాంటిది ఇపుడు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారంటు చెప్పారు. నిజానికి ఇది అసందర్భమైన ప్రస్తావననే అనుకోవాలి. ఇంతకాలం చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా తాను రౌడీలకే రౌడీనని జగన్ లాంటి వాళ్ళని చాలామందిని చూశానని చెప్పుకున్నారు.





మరి ఇపుడు తాను ఉద్యోగులు, ఎన్జీవోలు, ఉపాధ్యయ సంఘాలకు భయపడినట్లు చెప్పటం ఏమిటో అర్ధంకావటంలేదు. తాను భయపడ్డానని చెప్పుకుంటే ఏదోలే అని అనుకోవచ్చు.  తాను ఎవరిని చూసి తాను భయపడ్డారో వాళ్ళే ఇపుడు జగన్ అంటే భయపడుతున్నారని చెప్పటంలో అర్ధమేంటి ? ఉద్యోగులు, ఎన్జీవోలు, టీచర్ల సంఘాల నేతలతో పాటు తనకు కూడా జగన్ అంటే భయమే అని అంగీకరించినట్లే కదా. అసలు భయాలు, భయపెట్టడాల ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు ?





ఇక్కడ విషయం ఏమిటంటే చాలాకాలంగా తానేం మాట్లాడుతున్నారో చంద్రబాబుకే అర్ధంకావటంలేదు. నోటికొచ్చింది ఏదిపడితే అదంతా మాట్లాడేస్తున్నారు. జగన్ అంటే ధ్వేషం బుర్రలో నిండిపోవటంతో ఆ కసినంతా జనాల ముందు చూపించేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆవేశంతో ఊగిపోతు ఏదేదో మాట్లాడుతున్నారు. దాంతో తప్పులు దొర్లుతు, వాస్తవాలు  బయటకు వచ్చేస్తున్నాయి.





బొబ్బిలిలో జరిగిన సభలో మాట్లాడుతు చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత చివరలో సైకిల్ పోవాలి..సైకిల్ కు ఓట్లేయద్దు అని చెప్పారు. సైకిల్ కు పోవాలని స్వయంగా చంద్రబాబే మైకులో చెప్పటంతో పక్కనే ఉన్న తమ్ముళ్ళు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతలోనే మళ్ళీ సర్దుకుని సారి అని చెప్పి వైసీపీ పోవాలని గట్టిగా అరిచి చెప్పారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది. మాట్లాడేటపుడు కాస్త ప్రశాంతంగా మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ లేని ఆవేశాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాగ తెచ్చిపెట్టుకుని ఊగిపోతేనే సమస్యలు వస్తాయి. మొత్తానికి గతంలో తాను చెప్పుకున్నట్లు ధైర్యవంతుడిని కానని స్వయంగా చంద్రబాబే అంగీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: