ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ కొంచెం కొంచెం గా ప్రజలలో నమ్మకాన్ని మళ్ళీ కూడగట్టుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తోంది. అందులో ఒక భాగమే మూడు రోజుల నుండి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్ర. ఇది మొత్తం నాలుగు వందల రోజుల పాటు జరగనుంది. ఇప్పుడు టీడీపీ ఆశలు అన్నీ ఈ పాదయాత్ర మీదనే ఆధారపడి ఉన్నాయి. కుప్పం నుండి ఈ యాత్ర మొదలు అయింది.. కానీ మొదటిరోజునే నందమూరి తారకరత్నకు ఆరోగ్య సమస్య మొదలు కావడంతో అభిమానులు కాస్త బాధపడినా , ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం నారా లోకేష్ తో కలవనున్నారు.

కానీ ఒక విషయం మాత్రం టీడీపీ అభిమానులు మరియు కొందరి కార్యకర్తలకు రుచించడం లేదు. దాదాపుగా ఎన్నికల ముందు వరకు సాగుతున్న ఈ పాదయాత్ర పార్టీ భవిష్యత్తుకు ఎంత కీలకం అన్న విషయం తెలిసిందే. ఇటువంటి సందర్భంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొడుకు వెంట ఉండకపోవడం చాలా మందిని బాధపెట్టింది. కానీ చంద్రబాబు మాత్రం తాను ఈ యాత్రకు గైర్హాజరు కాకపోవడానికి చాలా పెద్ద కారణమే చెప్పారట. ఇంతకాలం నారా లోకేష్ ఒక చంద్రబాబు నాయుడు కొడుకుగానే గుర్తింపును దక్కించుకున్నాడు. ఇప్పుడు తానే సారధ్యం వహిస్తున్న ఈ పాదయాత్రకు కూడా చంద్రబాబు వెళితే తనకు దక్కే ప్రాధాన్యత రాష్ట్రానికి తెలియకుండా పోతుందని గ్రహించిన చంద్రబాబు ఈ పాదాయాత్రకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయినప్పటికి తెరవెనుక ఉండి ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుంది ? ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది అన్న విషయాలను తెలుసుకుంటూ ఉన్నారట. అయితే రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్న ప్రకారం చంద్రబాబు ఈ పాదయాత్ర సమయంలో కొడుకుతో ఉండి ఏ విధంగా మాట్లాడాలి ? ప్రజలతో ఎలా మమేకం కావాలి ? సమయస్ఫూర్తిగా ఎలా వ్యవహరించాలన్న పలు విషయాలను చెప్పే అవకాశం కల్పించుకుని ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు. పూర్తి సమయం కాకపోయినా మధ్య మధ్యలో అయినా చంద్రబాబు వెళితే ఫలితం మరోలా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ పాదయాత్రకు కనుక సరైన స్పేద్దన రాకపోతే చంద్రబాబు తీసుకున్న ఈ పొరపాటు నిర్ణయమే కారణం అయ్యే అవకాశం లేకపోలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: