తన ఆదేశాలను పాటించని ఎంఎల్ఏపై వేటు వేయటానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారా ? తాజాగా జరిగిన వర్క్ షాపు తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కాలంటే గడపగడపకు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎంఎల్ఏలందరు తప్పకుండా పాల్గొని తీరాల్సిందే అని జగన్ ఇప్పటికి చాలా సార్లే చెప్పారు. ఇప్పటికి మూడు వర్క్ షాపులు నిర్వహించిన జగన్ ప్రతిసారి మంత్రులు, ఎంఎల్ఏలను ఇదే విషయమై హెచ్చరిస్తునే ఉన్నారు.
సోమవారం జరిగింది నాలుగు, ఫైనల్ వర్క్ షాప్. ఫిబ్రవరి 13వ తేదీన జరగబోయేదే ఫైనల్ వర్క్ షాపని గతంలోనే జగన్ చెప్పారు. వివిధ మార్గాల్లో సేకరిస్తున్న సమాచారం ఆధారంగా టికెట్లు ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తానని స్పష్టంగా ప్రకటించారు. అయినా చాలామంది ప్రోగ్రామ్ లో పాల్గొనలేదని ఫీడ్ బ్యాక్ వచ్చిందట. పార్టీవర్గాల సమాచారం ప్రకారం సుమారు 30 మంది ఎంఎల్ఏలు గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో సరిగా పాల్గొనలేదని తెలిసింది.
వీరిలోనే నలుగురు ఎంఎల్ఏలైతే అసలు ఒక్కరోజు కూడా కార్యక్రమంలో పాల్గొనలేదనే ఫీడ్ బ్యాక్ రావటంతో జగన్ ఆశ్చర్యపోయారట. ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయం మీదే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తానని జగన్ ఇంత గట్టిగా చెప్పినా కొందరు ఎంఎల్ఏలు పట్టించుకోలేదంటే ఏమిటర్ధం ? ఇదే ఇపుడు పార్టీలో పెద్ద చర్చగా మారింది.
మొత్తంమీద చాలామంది ఎంఎల్ఏలకు జగన్ ఫుల్లుగా క్లాసు పీకారని సమాచారం. అయితే జగన్ ఎంత క్లాసులు పీకినా కొంతమంది ఎంఎల్ఏలు తమ వైఖరిని మార్చుకోవటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు. ఈ విషయం తాజా వర్క్ షాపులో మరోసారి బయటపడింది. ఇప్పటికే ఎంఎల్ఏల పనితీరు ఆధారంగా కనీసం 35 మంది ఎంఎల్ఏలకు జగన్ టికెట్లివ్వరనే ప్రచారం అందరికీ తెలిసిందే. జరుగుతున్న ప్రచారానికి తాజా వర్క్ షాపులో బయటపడిన ఫీడ్ బ్యాక్ దాదాపు సరిపోతోంది. కాబట్టి ఫైనల్ నిర్ణయం జగన్ మీదే ఆధారపడుంది. చివరకు ఏమవుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి