కరకట్ట అక్రమనిర్మాణం ఓనర్ లింగమనేని రమేష్ కు హైకోర్టు పెద్ద షాకిచ్చింది. కరకట్టమీద నిర్మించిన అక్రమనిర్మాణంలో చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఆ భవనాన్ని జప్తుచేయటం కోసం సీఐడీ నోటీసులు ఇచ్చింది. దాన్ని చాలెంజ్ చేస్తు లింగమనేని సీఐడీ కోర్టులో కేసు వేశారు. భవనాన్ని జప్తుచేయటానికి వీల్లేదంటు లింగమనేని వాదించారు. అయితే లింగమనేని పిటీషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. లింగమనేని వాదనలు వినిపించేందుకు కోర్టు అంగీకరించలేదు.
కింది కోర్టు ఆదేశాలను చాలెంజ్ చేస్తు లింగమనేని హైకోర్టులో పిటీషన్ వేశారు. తన వాదనలు వినేట్లుగా కిందికోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని లింగమనేని పిటీషన్లో కోరారు. అయితే లింగమనేని పిటీషన్ను హైకోర్టు కూడా కొట్టేసింది. కిందికోర్టుకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పేసింది. అయితే లింగమనేని పిటీషన్ పై స్పందించాల్సిందిగా సీఐడీకి కోర్టు నోటీసు జారీచేసింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే చంద్రబాబు, లింగమనేని కూడబలుక్కునే డ్రామాలాడుతున్నారు.
విషయం ఏమిటంటే టీడీపీ అధికారంలో ఉండగా ఇదే భవానాన్ని లింగమనేని ప్రభుత్వానికి రాసిచ్చేసినట్లు స్వయంగా చంద్రబాబే చెప్పారు. అప్పట్లో లింగమనేని మీడియాతో మాట్లాడుతు తన భవనాన్ని ప్రభుత్వానికి రాసిచ్చేసినట్లు చెప్పారు. అసలు టీడీపీ అధికారంలోకి రాగానే కరకట్టమీద నిర్మించిన భవనాలన్నీ అక్రమనిర్మాణాలని చెప్పి కూల్చేయబోతున్నట్లు నోటీసులు కూడా జారీచేసింది. ఎప్పుడైతే చంద్రబాబు కన్నా లింగమనేని అక్రమనిర్మాణం మీద పడిందో వెంటనే అది సక్రమమైపోయింది.
2019లో టీడీపీ ఓడిపోయినా చంద్రబాబు అక్రమనిర్మాణంలోనే ఉంటున్నారు. దాన్ని ఖాళీ చేయాలనే చర్చ వచ్చినపుడు ప్రైవేటు భవనంలో తానుంటే ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏమిటని చంద్రబాబు ప్రశ్నించటం విచిత్రంగా ఉంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రభుత్వ భవనం అని చెప్పి ప్రతిపక్షంలోకి రాగానే ప్రైవేటు భవనం ఎలాగైపోయిందో చంద్రబాబు, లింగమనేనే చెప్పాలి. ఇదంతా సీఐడీ వివరించటంతోనే లింగమనేనికి వాదనలు వినిపించే అవకాశం కోర్టు ఇవ్వలేదేమో. ఇపుడు హైకోర్టు కూడా దాన్నే ధృవపరిచింది. మరి లింగమనేని ఏమిచేస్తారో చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి