తెలుగుదేశంపార్టీ ఆరోపణలు చాలా విచిత్రంగా ఉంటాయి. పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతు జగన్మోహన్ రెడ్డిపైన నోటికొచ్చింది మాట్లాడారు. ఆయన ఏమంటారంటే జగన్ కు భారతి సిమెంట్స్ లో 2,38, 60,435 షేర్లున్నాయట. జగన్ కున్న షేర్ల విలువ సుమారు రు. 2500 కోట్లుగా చెప్పారు. ఇన్ని వేల కోట్లరూపాయల విలువైన షేర్లున్న జగన్ పెత్తందారా లేకపోతే పేదవాడా అని అడిగారు. జగన్ తాను పేదవాడినన్నట్లుగా కలరింగ్ ఇస్తుంటారని ఆరోపించారు.
జగన్+భార్య భారతికి ఉన్న షేర్ల విలువ సుమారు రు. 4 వేల కోట్లపైమాటే అన్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయల సంపద ఉన్న జగన్ పేదల గురించి మాట్లాడటం ఏమిటని విచిత్రమైన లాజిక్ లేవదీశారు. భారతి సిమెంట్స్ టర్నోవర్ 2001-2004 మధ్యలో రు. 2 వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. వైఎస్సార్ హౌసింగ్ పథకానికి భారతి సిమెంట్స్ వాడలేదా అని రెడ్డి నిలదీశారు. భారతి ఏడాదికి రు. 2.90 కోట్ల జీతం తీసుకుంటున్నది, కోటి రూపాయల అలవెన్సులు తీసుకుంటున్నది వాస్తవమా ? కాదా చెప్పాలన్నారు.
ఇక్కడ వెంకటరమణారెడ్డి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే తాను పేదవాడినని జగన్ ఎప్పుడూ చెప్పలేదు. చంద్రబాబునాయుడు లాగ తన చేతికి వాచీలేదు, వేలికి ఉంగరం లేదనే బీద మాటలు ఎప్పుడూ మాట్లడలేదు. ఇదే సమయంలో డబ్బులున్న వాళ్ళు పేదలగురించి మాట్లాడకూడదని ఎక్కడైనా రూలుందా ? ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్షాల్లోని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు ఎల్లోమీడియా యాజమాన్యాలను జగన్ పెత్తందార్లుగా అభివర్ణించారు. అదికూడా ఎందుకు వర్ణించారంటే ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు, వార్తలు, కథనాలు అచ్చేసినందుకు మాత్రమే.
ఇక భారతి జీతాలు, అలవెన్సులంటారా అది కంపెనీ ఇష్టం మధ్యలో టీడీపీకి వచ్చిన బాధేమిటి ? హెరిటేజ్ ఫుడ్స్ లో భువనేశ్వరి, బ్రాహ్మణి జీత, బత్యాలు ఎంతని ఎవరైనా అడిగారా ? దేశం మొత్తంమీద బ్యాంకులో ఒక్కరూపాయి కూడా అప్పులేని సంస్ధ భారితి సిమెంట్స్ మాత్రమే అని రెడ్డి ఆశ్చర్యంగా చెప్పారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది ? బ్యాంకుల నుండి వేల కోట్లరూపాయల అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కన్నా అప్పులేనందుకు సంతోషించాలి కదా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి