వైసీపీ, తెలుగుదేశంపార్టీల మధ్య గుడివాడ నియోజకవర్గం కొంతకాలంగా ఎంతటి మంటలు మండిస్తున్నదో అందరికీ తెలిసిందే. దానికి కారణం ఏమిటంటే మాజీమంత్రి, ఎంఎల్ఏ కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్ ను టార్టెట్ చేస్తుండటమే. తమ్ముళ్ళేమో కొడాలిని గిల్లి వదిలేస్తారు. కొడాలేమో చంద్రబాబు, లోకేష్ పైన రెచ్చిపోతున్నారు. దాంతో రెండుపార్టీల్లోను బాగా మంటటు మండుతున్నాయి. ఎలాగైనా వచ్చేఎన్నికల్లో గుడివాడలో కొడాలిని ఓడించాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అనేక కాంబినేషన్లను ట్రైచేసి చివరకు ఎన్ఆర్ఐ వెనిగళ్ళ రాము అనే క్యాష్ పార్టీని అభ్యర్ధిగా  పట్టుకున్నారు.





ఎప్పుడో ఎన్నికల సమయంలో ఉండే టెన్షన్ ఇపుడే మొదలైపోయింది. గుడివాడలో గురువారం చంద్రబాబు, కొడాలి గురువారం రెండు భారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా కొడాలి భారీ సభ నిర్వహించారు. ప్రతి ఏడాది ఎన్టీయార్ వర్ధింతిని కొడాలి జరుపుతున్నారు. ఇదే సమయంలో గుడివాడలోనే ‘రా కదలిరా’ అనే కార్యక్రమాన్ని టీడీపీ భారీ ఎత్తున నిర్వహించింది. బహిరంగసభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీయార్ వర్ధంతి అంటేనే చంద్రబాబు వెన్నుపోటు, సీఎం పోస్టుతో పాటు పార్టీని చంద్రబాబు లాగేసుకున్న వైనాన్ని కొడాలి ప్రస్తావించచుండా ఉండరు.





అలాగే గుడివాడలో బహిరంగసభ అంటే కొడాలిపై చంద్రబాబు అండ్ కో  మాట్లాడటం తప్పదు. ఎందుకంటే మరో మూడునెలల్లో ఎన్నికలు జరుగుతుండటమే కారణం. అందుకనే ఒకేరోజు జరిగిన రెండు కార్యక్రమాల్లో పైన చెప్పుకున్నదే జరిగింది. టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టకుండా పోలీసులు తమ్ముళ్ళని అడ్డుకున్నారు. దాని తర్వాత సభల్లో ఇటు కొడాలి అటు చంద్రబాబు ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు.  ఎన్టీయార్ వర్ధంతిని మార్చలేరు కాబట్టి ‘రా కదలిరా’  కార్యక్రమాన్ని అయినా ఒక రోజు వాయిదా వేసుకునుంటే బాగుండేది.





ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి చావుకు కారణమై ఆ తర్వాత నుండి జయంతులు, వర్ధంతులు చేస్తున్నారంటు కొడాలి పదేపదే చంద్రబాబును టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో లబ్దికోసం మాత్రమే ఎన్టీయార్ జయంతి, వర్ధంతులను చంద్రబాబు వాడుకుంటున్నారని కొడాలితో పాటు యావత్ వైసీపీ చాలా ఆరోపణలు చేస్తున్నది. మొత్తానికి పై రెండు కార్యక్రమాలు గుడివాడలో మంటలు మండించాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: