జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సీనియర్ నేత హరిరామ జోగయ్య మరొకసారి విరుచుకుపడ్డారు. జనసేన పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీ సీట్ల గురించి క్లారిటీ రావడంతో ఆదివారం రోజున పవన్ కళ్యాణ్ కు ఒక లేఖ కూడా రాసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకరు ఇవ్వడం మరొకరు దేహి అనడం ఇది పొత్తు ధర్మం అనిపించుకోదంటు ఆయన తెలియజేశారు.. కేవలం జనసేనకు 20 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా అంటూ కూడా హరి రామజోగయ్య ప్రశ్నించారు.. టిడిపి జనసేన సీట్లు పంపకం రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేయాలంటూ వెల్లడించారు.


బలమైన అభ్యర్థుల ఆధారంగా 24 నియోజకవర్గాలను ఎంపిక చేయడం జరిగిందంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు.. జనసైనికుల శక్తిని పవన్ కళ్యాణ్ ఎందుకు అంత తక్కువగా అంచనా వేస్తున్నారో తనకు అర్థం కావడం లేదు అంటూ కూడా వెల్లడించారు.. 24 నియోజవర్గాలు కేటాయించడంపై తన చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు.. అలాగే పవన్ కళ్యాణ్ కు 2.5 సంవత్సరాలు సీఎంగా చూడాలంటూ అభిమానులు కోరుకుంటున్నప్పటికీ ఇలాంటి వేవి కూడా అసలు జనసేన పార్టీలో కనిపించలేదు..



సీట్ల కేటాయింపులో కూడా అన్యాయం జరగడంతో జనసైనికులు ఆవేదన చెందుతున్నారంటూ హరిరామ జోగయ్య వెల్లడించారు. ఇలాంటి అన్ని తప్పులు చేస్తూ వైసిపి పార్టీని ఎలా ఓడించాలనుకుంటున్నారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.. టిడిపి జనసేన లకు చెరిసగం మంత్రి పదవులు కూడా ఇవ్వాలని ఈ ప్రకటన చంద్రబాబు నుంచే రావాలంటూ కూడా ఆయన తెలియజేశారు.. అయితే హరి రామ జోగయ్య ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ లేదా ఆయన జన సైనికుల నుంచి ఏవిధంగా సమాధానాలు వస్తాయో చూడాలి మరి.. అయితే ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి నుంచి నిలబడతాడు అనే విషయం పైన క్లారిటీ కూడా ఇవ్వలేదు.. హరిరామ జోగయ్య చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే జనసేన పార్టీ ఇంత దీనమైన పరిస్థితిలో ఉందా అనే విధంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: