ఎన్నికలు వచ్చాయి అంటే చాలు గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే రాజకీయాలలో ఎన్నడు చూడని చిత్ర విచిత్రాలు కూడా ఎన్నికల సమయంలో కనిపిస్తూ ఉంటాయి. అప్పటివరకు ఓటర్లకి కనీసం మొహం కూడా చూపించని నేతలు అందరూ కూడా ప్రజల్లో వాలిపోయి తాము ప్రజల మనిషివి అని నిరూపించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.


 అయితే ఇక ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామమే నెలకొంది. మొన్నటి వరకు విమర్శలు ప్రతి విమర్శలతోనే సరిపెట్టుకున్న రాజకీయ నాయకులందరూ.. ఇక ఇప్పుడు ప్రచార భరిలో దూసుకుపోవడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నారు. అయితే అధికారంలో ఉన్న జగన్ ను గద్దె దించేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇందుకోసం జనసేన, బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని మరి ముందుకు సాగుతున్నారు. ఇంకోవైపు జగన్ ఒంటరిగానే ఎన్నికల్లో బలిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. కాగా ఇప్పటికే ఇక వైసిపి నాయకులు ప్రజల్లో తిరుగుతూ ప్రచారం చేసేస్తూ ఉన్నారు.


ఇలాంటి సమయంలో ఇక వైసిపి నాయకులకు కొన్నిచోట్ల ఓటర్ల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రచారానికి వెళ్లిన సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. మా ప్రాంత అభివృద్ధి కొరవడింది.. మాకోసం మీరేం చేశారు అంటూ కొంతమంది ఎదురు తిరిగి ప్రశ్నిస్తూ ఉండడం గమనార్హం. ఇలాంటిది జరిగినప్పుడు  వైసీపీ నాయకులు ఏం చెప్తారు అన్న విషయాన్ని కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇలా ప్రశ్నిస్తున్నది ప్రతిపక్ష టీడీపీ, జనసేన సింపతైజర్లు అని వైసిపి నేతల భావన. అయితే ఇలా ప్రజలు ప్రశ్నించినప్పుడు ఏం చేయాలి అనే విషయంపై అధిష్టానాన్ని ప్రశ్నించారు ఆ పార్టీ నాయకులు.


 కాగా ఈ విషయంపై ఇక ప్రచారంలో దూసుకుపోతున్న నాయకులందరికీ కూడా సీఎం జగన్ కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ప్రజలు ప్రశ్నించినప్పుడు సీరియస్గా మాట్లాడిన లేదంటే ఎదురుదాడికి దిగిన అవన్నీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం చేస్తారని.. తద్వారా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది. అందుకే ఎవరైనా ఇలా ప్రశ్నించినప్పుడు నవ్వుతూ వారికి నమస్కరించి అక్కడి నుంచి ముందుకు సాగిపోవడమే మంచిది అని ఆదేశాలు ఇచ్చారట జగన్. ఇలా నిశ్శబ్దమే ఆయుధంగా ఈ ఎన్నికల్లో పార్టీ నాయకులు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: